ఎన్టీఆర్ బర్త్‌డేను పురస్కరించుకుని అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ (NTR), హృతిక్ రోషన్ (Hrithik Roshan) కలిసి నటించిన ‘వార్ 2’ (WAR 2) టీజర్‌ను టీమ్ విడుదల చేసింది. ఇందులో ఎన్టీఆర్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ‘వార్’ మూవీకి కొనసాగింపుగా రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయిక. ‘నా కళ్లు నిన్ను ఎప్పటినుంచో వెంటాడుతున్నాయి కబీర్. నీకు నా గురించి తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటావు. గెట్ రెడీ ఫర్ వార్’ అంటూ ఎన్టీఆర్ మాటలు పవర్ఫుల్గా అనిపించాయి. యాక్షన్ ప్యాక్డ్గా రూపొందిన టీజర్ను మీరూ చూసేయండి..






