అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచానికి శరాఘాతంగా మారుతున్నాయి. అంతేకాకుండా ఆయన ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ (Former president joe Biden) ఆరోగ్య పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ (Cancer) సోకిందని, ఇది దేశానికి పెద్ద సమస్యగా మారుతుందని ట్రంప్ ఆరోపించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ ఈ విషయాన్ని దాచారని, ఇది ప్రజలకు ద్రోహం చేయడమేనని ఆయన విమర్శించారు.
అప్పుడే ఎందుకు చెప్పలేదు..
గతంలో జో బైడెన్‌కు మతిమరుపు ఉందని ట్రంప్ ఆరోపించగా.. వైద్యులు మాత్రం ఆ వాదనను ఖండించారు. వయసు కారణంగా బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొన్ని తప్పులు చేశారని, పాలనలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని ట్రంప్ విమర్శించారు. దేశం కోసం సరైన నిర్ణయాలు తీసుకోలేదని, ఫలితంగా నిరుద్యోగం (Unemplyment), ద్రవ్యోల్భణం పెరిగాయని ఆయన తీరును తప్పుబట్టారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఎందుకు దాచారని బైడెన్‌ను ప్రశ్నించారు.
ఇది రాజకీయ అంశం కాదు..
ఈ విషయాన్ని ఆలస్యంగా బయటపెట్టడాన్ని ట్రంప్ ప్రశ్నించారు. బైడెన్‌కు ప్రొస్టేట్ క్యాన్సర్ (Biden Cancer News) నిర్ధారణ అయినట్లు ఆయన కార్యాలయం ప్రకటించగా.. గ్లీసన్ స్కోరింగ్ సిస్టమ్ అంచనా ప్రకారం బైడెన్ స్కోరు 9 ఉన్నట్లు డెమోక్రటిక్ కార్యాలయం తెలిపింది. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. ‘క్యాన్సర్ సోకిందన్న విషయం చాలా రోజుల తర్వాత తెలియడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. స్కోరు 9కి చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. బైడెన్ మానసికంగా ఆరోగ్యంగానే ఉన్నారని గతంలో అదే వైద్యుడు వెల్లడించారు.
“ఇది రాజకీయమైన అంశం కాదు. ఇది మన దేశానికి ప్రమాదం(Danger to America). క్యాన్సర్ సోకిన విషయం ఎందుకు ఇన్ని రోజులు దాచారు? ప్రజలకు దీని గురించి వాస్తవాలు తెలియాలి.ఠ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ట్రంప్ అలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని డెమోక్రాట్లు తప్పుబడుతున్నారు. ట్రంప్ ఇప్పటికీ రాజకీయ దురుద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కొందరు ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా, మరికొందరు ఖండిస్తున్నారు.






