మాంచెస్టర్(Manchester) వేదికగా టీమ్ఇండియా(Team India)తో జరుగుతున్న నాలుగో టెస్టులో మూడో రోజు కూడా ఇంగ్లండ్(England) ఆధిపత్యం కనబరిచింది. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు పట్టు బిగించి భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇంగ్లండ్ బ్యాటర్లు బజ్‌బాల్(Buzz ball) ఆటతో విజృంభించడంతో ఆ జట్టును తిరుగులేని స్థితిలో నిలిచింది. దీంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు కోల్పోయి 544 స్కోరు సాధించింది. దీంతో 186 రన్స్ లీడ్ సాధించింది. ఓవర్‌నైట్ స్కోరు 225/2తో ఆ జట్టు ఆట కొనసాగించగా.. జోరూట్(150) భారీ శతకంతో కదం తొక్కాడు. ఓలీ పోప్(71) కూడా సత్తాచాటాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్(Ben Stokes) ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్నాడు. ఐదు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాసించిన స్టోక్స్(77*) బ్యాటుతోనూ చెలరేగాడు. నాలుగో రోజైనా గిల్ సేన పుంజుకోకుంటే ఓటమి తప్పదు.

క్రీజులో పాతుకుపోయాడు..
ఇక మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్(Joe Root) ఆటే హైలైట్. భారత బౌలర్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అతడు ధాటిగా బ్యాటింగ్ చేశాడు. 11 రన్స్‌తో మూడో రోజును కొనసాగించిన రూట్ క్రీజులో పాతుకుపోయాడు. అతన్ని అవుట్ చేసేందుకు భారత బౌలర్లు(Indian Bowlers) చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నిదానంగా ఆడుతూనే చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 38వ శతకాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే 150 పరుగులు చేసి భారీ శతకాన్ని నమోదు చేశాడు. దీంతో టెస్టుల్లో 13,409 రన్స్ పూర్తి చేసిన రూట్ కీలక మైలురాయిని సాధించాడు.
రెండో స్థానానికి ఎగబాకిన రూట్
కాగా ఈ సెంచరీ ద్వారా టెస్టుల్లో అత్యధిక రన్స్ చేసిన క్రికెటర్ల జాబితాలో రెండో స్థానానికి రూట్ ఎగబాకాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతను 13, 259 రన్స్‌తో ఆ జాబితాలో 5వ స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా రాహుల్ ద్రవిడ్(13,288), జాక్వెస్ కల్లీస్(13,289), రికీ పాంటింగ్(13,378)లను వెనక్కినెట్టాడు. ఈ జాబితాలో సచిన్(15,921) అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ కంటే రూట్ ఇంకా 2,512 రన్స్ వెనకబడి ఉన్నాడు. కొంతకాలంగా టెస్టుల్లో నిలకడగా రాణిస్తున్న రూట్.. సచిన్(Sachin Tendilkar)ను కూడా అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Joe Root surpassed the Test legacy of #RahulDravid, #JacquesKallis and #RickyPonting in a single innings today.#JoeRoot climbs to No. 2! 📈
He goes past Ricky Ponting and now eyes the summit where #SachinTendulkar still reigns with 15,921 Test runs! 👑 #TestCricket#INDvsENG pic.twitter.com/Umab3p8LTa
— 🇮🇳 JDumde 🦁࿐ (@JDumde) July 25, 2025






