ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ క్వాలిఫయర్-1 మ్యాచ్ జరుగుతోంది. చండీగఢ్‌లోని ముల్లాన్ పూర్(Mullanpur) వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ (RCB vs PBKS) జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్(Rajat Patidhar) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అలాగే తుషార ప్లేస్‌లో ఆసీస్ పేసర్ జోష్ హేజిల్ వుడ్ జట్టులోకి వచ్చాడు. అటు పంజాబ్ కింగ్స్(PBKS) సైతం ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ స్థానంలో అజ్మతుల్లా జట్టులోకి వచ్చాడు. కాగా ఈ మ్యాచులో నెగ్గిన జట్టు నేరుగా ఐపీఎల్ 2025 ఫైనల్ చేరిన తొలి జట్టుగా నిలుస్తుంది.
గెలిచిన జట్టు ఫైనల్‌కు.. ఓడితే మరో ఛాన్స్
కాగా ఐపీఎల్ హిస్టరీలో ఈ రెండు జట్లు మొత్తం 34 సార్లు తలపడ్డాయి. అందులో పంజాబ్ 18, బెంగళూరు 17 సార్లు నెగ్గాయి. ఇక ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండుసార్లు ఆడగా ఒక్కో మ్యాచులో ఒక్కో జట్టు గెలిచింది. చివరిసారిగా ఇదే వేదికగా జరిగిన మ్యాచులోనూ ఆర్సీబీ పంజాబ్ గెలవడం ఆ జట్టుకు పాజిటివ్‌గా మారనుంది. అటు సొంత గ్రౌండ్ కావడంతో అభిమానుల మద్దతు పంజాబ్‌కు ఉండనుంది. ఈ మ్యాచులో నెగ్గిన జట్టు ఫైనల్‌కు వెళ్లనుండగా.. ఓడిన జట్టు రేపు ముంబై వర్సెస్ గుజరాత్‌లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
తుది జట్లు ఇవే..
Punjab Kings: ప్రియాంష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(Wk), శ్రేయాస్ అయ్యర్(C), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్
Royal Challengers Bengaluru: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(C), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(Wk), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ
#RajatPatidar wins the toss & #RCB opt to bowl first in Qualifier 1! 🔥
Omarzai IN for PBKS, Hazlewood IN for RCB 💥 #PBKSvsRCB pic.twitter.com/325cz39dJy
— Anil (@anil_AK143) May 29, 2025






