Kamal Haasan: కమల్ హాసన్‌కు షాక్.. బెంగళూరులో కేసు ఫైల్!

తమిళ్ స్టార్, ప్రముఖ నటుడు కమల్ హాసన్‌(Kamal Haasan) కొత్త చిక్కుల్లో పట్టారు. ‘కన్నడ(Kannada) భాష తమిళం(Tamil) నుంచే పుట్టింది’ అని కమల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కర్ణాటక(Karnataka)లో దుమారం రేపుతున్నాయి. తన తాజా చిత్రం ‘థగ్ లైఫ్(Thug Life)’ ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ఆయ‌న‌ చేసిన ఈ వ్యాఖ్యలు కన్నడిగుల‌ ఆగ్రహానికి కార‌ణ‌మ‌య్యాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తాజాగా కమల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కర్ణాటక రక్షణ వేదిక (KVR) రంగంలోకి దిగింది. బెంగళూరులోని RTనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయ‌న‌పై ఫిర్యాదు చేసింది.

కమల్ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని, కన్నడిగులు, తమిళుల మధ్య విద్వేషాలను సృష్టించేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొంది. ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని KVR డిమాండ్ చేసింది. దీంతో క‌మ‌ల్‌పై పోలీసులు కేసు(Case) న‌మోదు చేసిన‌ట్లు తెలుస్తోంది.

കമൽ ഹാസൻ മാപ്പ് പറഞ്ഞില്ലെങ്കിൽ ത​ഗ് ലൈഫ് പ്രദർശിപ്പിക്കരുത്'; ചിത്രത്തിനെതിരെ കർണാടക മന്ത്രി, Kamal Haasan,Thug life,Thug life movie,Karnataka,film ban,controversial ...

ఇప్పటికే సారీ చెప్పిన‌ కమల్

అయితే, త‌న‌ వ్యాఖ్యలపై కమల్ హాసన్ స్పందిస్తూ ఇప్ప‌టికే సారీ చెప్పారు. తాను ప్రేమతో ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరినీ అగౌరవపరచాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. భాషల చరిత్ర గురించి మాట్లాడే అర్హత రాజకీయ నాయకులకు లేదని పేర్కొన్నారు. ఈ చర్చను చరిత్రకారులు, భాషా నిపుణులకు వదిలేయాలని అన్నారు. అంతకుముందు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా కమల్‌కు కన్నడ భాష చరిత్రపై సరైన అవగాహన లేదన్నారు. కాగా కమల్ నటించిన ‘థగ్ లైఫ్’ మూవీ జూన్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Kamal Haasan Kannada Tamil Language Controversy | BJP | कमल हासन बोले-  कन्नड़ भाषा तमिल से जन्मी: कन्नड़ एक्टर की तरफ इशारा करके कहा, BJP बोली-  भाषा का अपमान किया | Dainik ...

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *