మరోసారి విడాకులపై చర్చ.. ఎమోషనల్ అయిన తేజస్విని గౌడ

తేజస్విని గౌడ మొదటగా తమిళంలో వచ్చిన విద్యా నెం.1 సిరీయల్ ద్వారా టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో కోయిలమ్మ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ఆడియెన్స్ ను పలకరించింది. ఈ సీరియల్ లో తేజస్విని గౌడ చిన్ని పాత్రలో చక్కటి నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది .

ఇటు కన్నడ టెలివిజన్ రంగంలోనూ ‘బిలి హెంద్తి’ అనే సీరియల్ లో నటించింది. రమ్య అనే పాత్ర ద్వారా మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగు, కన్నడలోనే కాకుండా తమిళంలోను మరో సీరియల్ లో నటించింది. విద్యా నెం.1తో పాటు సుందరి నీయుమ్ సుందన్ నానుమ్ అనే సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ ద్వారా మరింతగా క్రేజ్ దక్కించుకుంది. ఇలా మూడు భాషల్లోని టెలివిజన్ సీరియల్స్ లో నటించి మెప్పింది.

తేజస్విని గౌడకు తెలుగు ఆడియెన్స్ లోనే మంచి గుర్తింపును దక్కించుకుంది. బుల్లితెర ప్రేక్షకులు ఆమెను ఎంతగానో ఆదరించారు. అయితే తేజస్విని గౌడ బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రన్నరప్ అమర్ దీప్ ను మూడేళ్ల కిందనే పెళ్లి చేసుకుంది. 2022 డిసెంబర్ 11న వీరి వివాహం ఘనంగా జరిగింది. ప్రస్తుతం హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. సీరియల్స్ ద్వారా తేజస్విని మంచి గుర్తింపును దక్కించుకుంటే.. బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా అమర్ దీప్ క్రేజ్ సొంతం చేసుకున్నారు.

తాజాగా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో తేజస్విని గౌడ మరియు ఆమె భర్త అమర్ దీప్ చౌదరి గురించి వచ్చిన విడాకుల పుకార్లపై తేజస్విని స్పష్టత ఇచ్చిన విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై మరోసారి స్పందింది తేజస్విని . ఆహా లో ప్రారంభం కానున్న “కాకమ్మ కథలు” సీజన్ 2 ప్రోమో విడుదల కాగా, యాంకర్ రవితో పాటు తేజస్విని కూడా అతిథిగా పాల్గొన్నారు. ఈ షోకు హోస్ట్‌గా తేజస్వి మదివాడ వ్యవహరిస్తున్నారు. షోలో భాగంగా తేజస్వినిని ఆమె భర్తతో విడాకులు తీసుకుంటున్నారన్న వార్తల గురించి ప్రశ్నించగా, ఆమె ఎమోషనల్‌గా స్పందించారు.

గత కొన్ని రోజులుగా తరచూ అదే ప్రశ్న ఎదురవుతోందని, అలాంటి సందర్భాల్లో తన తండ్రి తనతో ఉంటే బాగుండేది అనిపించిందని ఎమోషనల్ అయింది తేజస్విని. ఆ మాటలు విన్న తేజస్వి మదివాడ ఆమెను హత్తుకుంది. అలాగే, తేజస్విని బిగ్ బాస్ హౌస్‌లోకి వెళతారా అనే ప్రశ్నకు ఆమె తడబడి సమాధానం ఇచ్చినట్లు ప్రోమోలో చూపించారు.

ఇదే అంశంపై గతంలో ఒక టాక్ షోలో కూడా తేజస్విని గౌడ్ స్పందిస్తూ, ఇవన్నీ రూమర్లే అని స్పష్టం చేసింది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం, వాటికి విడిపోతారా అని చెప్పింది. తన భర్త అమర్ దీప్ కంటే తనకు ఎక్కువ కాదని త్వరలోనే పండంటి బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నట్టు కూడా గుడ్ న్యూస్ చెప్పింది.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *