
IPL-2025 సీజన్ తుది సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు నెలలకుపైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్(IPL) అభిమానులను అలరించింది. టోర్నీలో అదరగొట్టిన రెండు మేటి జట్లు ఈ రోజు అహ్మదాబాద్ (Ahmadabad) వేదికగా జరిగే ఫైనల్ పోరులో నువ్వా-నేనా అన్నట్లు తలపడనున్నాయి. టోర్నీలో చెరో 19 పాయింట్లతో టాప్-2లో నిలిచిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్(RCB), పంజాబ్ కింగ్స్(PBKS) 18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో తొలిసారి కప్‌ను ముద్దాడేందుకు రెడీ అయ్యాయి.
రెండు జట్లలో ఈ ప్లేయర్లు కీలకం
క్వాలిఫయర్-1లో పంజాబ్‌ను చిత్తు చేసి నేరుగా ఫైనల్(Final)కు దూసుకెళ్లిన RCB అదే ఊపులో చివరి మ్యాచులోనూ విజయం సాధించి కప్ అందుకోవాలని భావిస్తోంది. అటు క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో చిత్తయినా.. ఆ తర్వాత రెండో క్వాలిఫయర్‌లో ముంబైని పడగొట్టి మళ్లీ అదే ఆర్సీబీతో తుది సమరానికి సిద్ధమైంది పంజాబ్. ఇక ఇవాళ జరిగే మ్యాచులో ఎవరు నెగ్గినా ఐపీఎల్‌లో కొత్త ఛాంపియన్(New Champoin) అవతరించనుంది. ఆర్సీబీ జట్టులో కోహ్లీ(Kohli), సాల్ట్, పాటీదార్, జితేశ్, హేజిల్ వుడ్ కీలకంగా కాగా.. పంజాబ్‌లో అయ్యర్(Ayyar), ఇంగ్లిస్, నేహాల్, జాన్సెన్, చాహల్ కీలకం కానున్నారు. ఒక వేళ వర్షం వచ్చినా ఫైనల్‌కి రిజర్వు డే ఉంది.
ఐపీఎల్‌లో సమవుజ్జీలే..
RCB, PBKS మధ్య పోరు కూడా ఆసక్తికరంగానే ఉంది. హెడ్ టూ హెడ్‌లో ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. ఇప్పటివరకు 36 సార్లు ఎదురుపడ్డారు. అందులో ఆర్సీబీ 18 విజయాలు నమోదు చేస్తే.. పంజాబ్ కూడా 18 మ్యాచ్‌ల్లో నెగ్గింది. అయితే, చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఆర్సీబీనే ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగు గేముల్లో నెగ్గింది. పంజాబ్ ఒక్క మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది.
తుది జట్ల అంచనా
Royal Challengers Bengaluru: విరాట్ కోహ్లి, ఫిల్ సాల్ట్, మయాంక్ అగర్వాల్, రజత్ పాటీదార్ (C), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (Wk), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ
Punjab Kings: ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (Wk), శ్రేయాస్ అయ్యర్ (C), నేహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, అర్ష్‌దీప్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్/యుజ్వేంద్ర చాహల్, విజయ్‌కుమార్ వైశాక్