ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Shekhar Kammula) దర్శకత్వంలో, అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna), తమిళ్ స్టార్ నటుడు ధనుష్(Dhanush) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కుబేర(Kubera)’. ఈ సినిమా ప్రమోషన్స్(Promotions) ఊపందుకున్నాయి. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా, చిత్ర యూనిట్ తాజాగా ‘అనగనగా కథ’ అనే పాట(Song)ను విడుదల చేసింది. ఈ పాట సినిమాలోని కీలక పాత్రలైన నాగార్జున, ధనుష్‌ల చుట్టూ అల్లుకున్నట్లు తెలుస్తోంది. జూన్ 1వ తేదీన చిత్ర యూనిట్ ఓ భారీ ఈవెంట్‌ను నిర్వహించి, సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది.

ధనుష్, నాగ్ మొదటిసారి కలిసి నటిస్తుండటంతో..
ఇక ఇప్పుడు విడుదలైన ‘అనగనగా కథ’ పాట ద్వారా ధనుష్, నాగార్జున పోషిస్తున్న పాత్రల స్వభావాలను, వారు ఎదుర్కొనే పరిస్థితులను ప్రేక్షకులకు పరిచయం చేశారు. చంద్రబోస్(Chandrabose) రాసిన ఈ పాటకు హైడ్ కార్తి, కరీముల్లా తమ గాత్రాన్ని అందించారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్(DCP) మ్యూజిక్ అందిస్తున్నారు. ధనుష్, నాగార్జున మొదటిసారి కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతో పాటు తమిళంలోనూ మంచి ఆసక్తి నెలకొంది. ఈ మూవీని జూన్ 20వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






