ఐపీఎల్(IPL2025) 18వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) దుమ్మురేపింది. డిఫెండింగ్ ఛాంప్ కోల్ కతా నైట్ రైడర్స్(KKR)తో మ్యాచ్‌లో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన KKR జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 174 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే 56, సునీల్ నరైన్ 44, రఘువంశీ 30 పరుగులు మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. RCB బౌలర్లలో కృనాల్ పాండ్యా 3, హేజిల్వుడ్ 2 వికెట్లు పడగొట్టారు.
విరాట్ విజృంభన.. సూపర్ సాల్ట్
అనంతరం 175 పరుగుల లక్ష్యాన్ని RCB కేవలం 16.2 ఓవర్లలో కేవలం 3 వికెట్ల ఛేదించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (56) పరుగులు చేసి అవుట్ కాగా, స్టార్ బ్యాట్స్ మన్ కింగ్ కోహ్లీ (59) పరుగులతో అజేయంగా నిలిచి బెంగళూరు విజయంలో కీలకపాత్ర పోషించాడు. RCB కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ (16 బంతుల్లో 34 పరుగులు) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో లియామ్ లివింగ్‌స్టోన్ వరుసగా సిక్స్, ఫోర్ కొట్టి మ్యాచ్ ముగించాడు. దీంతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఐపీఎల్-18 సీజన్‌ను విక్టరీతో మొదలుపెట్టింది.
#CricketWithTOI | #PhilSalt’s extraordinary assault and #ViratKohli’s star power helped #RoyalChallengersBengaluru outshine defending champion #KolkataKnightRiders by seven wickets🏏🔥
Highlights of the match 🔗 https://t.co/IZWXZmGDeK#KKRvsRCB #KKRvRCB #IPL2025 pic.twitter.com/LADjwM7Ztt
— The Times Of India (@timesofindia) March 22, 2025
విరాట్ అరుదైన రికార్డు
ఈ క్రమంలోనే విరాట్(Virat) ఐపీఎల్‌లో ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. నాలుగు జట్లపై 1000కిపైగా రన్స్ చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. మ్యాచ్‌కు ముందు కోల్‌కతాపై విరాట్ 962 రన్స్‌తో ఉండగా.. ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో 1000 పరుగుల మార్క్ దాటాడు. T20 క్రికెట్ కెరీర్‌లో కోహ్లీకిది 400వ మ్యాచ్ కావడం విశేషం. భారత(India) తరఫున 400 IPL మ్యాచ్‌లు ఆడిన మూడో భారత ఆటగాడిగా విరాట్ ఘనత సాధించాడు. కాగా ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు SRH vs RR మధ్య జరగనుండగా.. రాత్రి 7.30 గంటలకు CSK vs MI జట్లు తలపడనున్నాయి.






