IPL-2025 చెన్నై సూపర్ కింగ్స్(CSK) పరాజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచులో చిత్తు చిత్తుగా ఓడింది. 188 పరుగుల లక్ష్యాన్ని రాయల్స్ కేవలం 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సునాయంగా విజయం సాధించింది. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ 14 మ్యాచుల్లో 10 పరాజయాలు, 4 విజయాలతో ఈ సీజన్‌లో తన ప్రస్థానం ముగించింది. చెన్నై జట్టు మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది.
17.1 ఓవర్లలోనే విజయం
కాగా ఢిల్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 187/8 స్కోరు చేసింది. ఆయుష్ మాత్రే 43, బ్రెవిస్ 42, దూబే 39 రాణించారు. ధోనీ 16 మరోసారి విఫలమయ్యాడు. రాయల్స్ బౌలరల్లో యుధ్ వీర్ 3, మధ్వాల్ 3 వికెట్లు తీశారు. అనంతరం 188 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాయల్స్.. ఓపెనర్లు జైస్వాల్ 36, వైభవ్ 57 రన్స్‌తోపాటు శాంసన్ 41, జురెల్ 31 పరుగులతో రాణించడంతో 17.1 ఓవర్లలోనే విజయం సాధించింది. చెన్నై బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు తీశాడు.
CSK 187/8 (20)
RR 188/4 (17.1) – RR win by 6 wickets!Teen prodigy Vaibhav Suryavanshi (57 off 33) & Jurel’s 31 off 12* seal a dominating chase!
Akash Madhwal’s 3/29 set the tone early.
CSK rattled, RR cruising!#IPL2025 #CSKvsRR #HallaBol #WhistlePodu pic.twitter.com/78trf9lxCp— MBE Sport HQ (@MBESportHQ) May 20, 2025






