సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్(Casting couch) అనేది ఎప్పటినుంచో చర్చనీయాంశంగానే ఉంది. తాజాగా, ప్రముఖ నటి సయామీ ఖేర్(Saiyami Kher ) తనకు కెరీర్ ఆరంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకున్నారు. తెలుగు చిత్రసీమ(Tollywood)కు చెందిన ఓ మహిళా ఏజెంట్ సినిమా అవకాశాల కోసం తనను ‘కమిట్మెంట్’ కోరినట్లు ఆమె వెల్లడించడం సంచలనంగా మారింది. అయితే, తాను అలాంటి పనులకు దూరంగా ఉంటానని, కొన్ని పరిమితులు తనకు ఉన్నాయని ఆమెకు స్పష్టం చేసినట్టు ఖేర్ వివరించారు.
నాకు వచ్చిన అవకాశాల పట్ల సంతోషంగా ఉన్నా..
కాగా సయామీ ఖేర్ 2015లో ‘రేయ్’ అనే తెలుగు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత 2016లో ‘మిర్జియా’తో హిందీలో అడుగుపెట్టారు. ‘మౌళి’, ‘చోక్డ్’, ‘వైల్డ్ డాగ్’, ‘ఘూమర్’ వంటి చిత్రాలతో పాటు ‘స్పెషల్ ఆప్స్’, ‘ఫాదూ’ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా ఆమె నటించి మెప్పించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు వచ్చిన అవకాశాల పట్ల సంతోషంగా ఉన్నానని, అయితే కెరీర్ మొదట్లో ఓ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని తెలిపారు.
మహిళ అయి ఉండి మరో మహిళతో అలా..
సయామీ మాట్లాడుతూ, “నా కెరీర్ తొలినాళ్లలో, ఓ తెలుగు సినిమా ఏజెంట్(Telugu film Women Agent) నన్ను కలిశారు. సినిమా అవకాశాల కోసం కొన్ని విషయాల్లో ‘సర్దుకుపోవాల్సి’ ఉంటుందని ఆమె నాతో అన్నారు. ఒక మహిళ అయి ఉండి మరో మహిళతో ఇలా మాట్లాడటం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది” అని వివరించారు.
🚨 🚨 #BreakingNews Saiyami Kher recalls female casting agent asking her to ‘compromise’ for role in Telugu film at 19 https://t.co/CkkNIqq0EL
Saiyami Kher recalled how she dealt with casting couch call for a Telugu film when she was just 19 years old.#TrendingNews #BigBrea…
— Instant News ™ (@InstaBharat) May 20, 2025






