
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో ‘స్పిరిట్’ (Spirit) మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్లు ఇప్పటికే సందీప్ రెడ్డి వెల్లడించారు. కాగా ఈ మూవీలో ప్రభాస్ సరసన కన్నడ క్రేజీ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
‘సప్త సాగరాలు దాటి’ మూవీతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రుక్మిణి.. ఎన్టీఆర్-నీల్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్తో మూవీలో ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
దీపికా పదుకొణెను కాదని..
ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. త్వరలోనే ‘స్పిరిట్’ యూనిట్‌లో జాయిన్ కానున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ వంగా.. నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న ఈ మూవీ కోసం దీపికా పదుకొణే(Deepika Padukone)ని తీసుకోవాలని భావించారు. అయితే దీపిక భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం, మరిన్ని కారణాలతో ఆమెని ప్రాజెక్టు నుంచి తప్పించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ రుక్మిణి వసంత్ను సంప్రదించడం.. అందుకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన త్వరలో రానుందంటూ ప్రచారం జరుగుతోంది.