అహ్మదాబాద్ వద్ద ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 241 మంది చనిపోయిన ఘటన మరువకముందే మరో ప్రమాదం జరిగింది. చైనా సరిహద్దుల్లో రష్యాలోని అంగారా ఎయిర్ లైన్స్ కు (Angara Airlines) చెందిన విమానం కూలిపోయింది. మొదట ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. కాగా కాసేపటికే అది కూలిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. ప్రమాద సమయంలో అందులో 43 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 49 మంది ఉన్నారు.
ఎయిర్ పోర్ట్కు 15 కిలోమీటర్ల దూరంలోనే..
అంగారా ఎయిర్ లైన్స్ కు చెందిన ఏఎన్-24 విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్ చెన్క్స్ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయల్దేరింది. మరికొద్ది సేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తో సంబంధాలు కట్ అయిపోయాయి. దీంతో అలర్ట్ అయిన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్ ను సిద్ధం చేశారు. విమానం కోసం గాలించగా.. ఎయిర్ పోర్ట్ కు 15 కిలోమీటర్ల దూరంలో కూలిపోయినట్లు గుర్తించారు. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.
అందరూ చనిపోయారా!
ఈ విమానం మొదట ల్యాండింగ్ కు ప్రయత్నించగా.. పరిస్థితులు అనుకూలించలేదట. రెండోసారి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. రాడార్ నుంచి గల్లంతై కూలినట్లు తెలుస్తోంది. విమానంలో ఉన్న మొత్తం 49 మంది ప్రయాణికుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు రష్యన్ మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రాణ నష్టంపై ఇంకా వివరాలు తెలియరాలేదు. అయితే భారీ ప్రమాదం కాబట్టి అందరూ చనిపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
Tragic Plane Crash in Russia: AN-24 Wreckage Found, All 49 Onboard Dead #PlaneCrash #AN24 #AmurOblast #AviationTragedy #AntonovCrash #RussiaChinaBorder #FlightDisaster #AirCrashInvestigation pic.twitter.com/Ha4B7pKCCH
— Geopolitics | News | Trends (@rareinfinitive) July 24, 2025






