Mana Enadu : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి (Rohit Shetty), అజయ్ దేవ్‌గణ్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ సింగం అగైన్ (Singham Agian). బ్లాక్ బస్టర్ ‘సింగం’(Singham) ఫ్రాంచైజీకి బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ గా హిట్ అయ్యాయి.
సింగం అగైన్ మూవీ
ఇప్పుడు సింగం ఫ్రాంఛైజీలో మరో చిత్రం రాబోతోంది. సింగం అగైన్ (Singham Agian) అంటూ వస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఇద్దరే కాకుండా.. దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్, రణ్‌వీర్ సింగ్, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, జాకీ ష్రాఫ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సింగంలో దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో టాక్ నడుస్తోంది. సల్మాన్ ఖాన్ ఐకానిక్ రోల్ అయిన దబాంగ్ (Dabangg)లోని చుల్‌బుల్ పాండే (Chulbul Pandey) పాత్రలో సింగం (Singham) సినిమాలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసి ఇటు అజయ్ దేవగణ్ ఫ్యాన్స్.. అటు సల్మాన్ ఖాన్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
దీపావళికి సింగం అగైన్ రిలీజ్
ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. సూర్య (Suriya Yamudu) నటించిన యుముడు మూవీకి రీమేక్ గా.. 12 ఏండ్ల కిందట వచ్చిన సింగం సినిమా బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయింది. దీనికి సీక్వెల్ గా మూడేళ్ల తర్వాత సింగం రిటర్న్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఇదే ఫ్రాంఛైజీ నుంచి సింగం అగైన్ అంటూ రోహిత్-అజయ్ కాంబో నుంచి మరో మూవీ వస్తోంది.






