Salman Khan: 31 ఏళ్ల గ్యాప్.. రష్మికకు లేని ఇబ్బంది మీకెందుకు?

సల్మాన్‌ఖాన్‌ (Salman Khan), రష్మిక (Rashmika Mandanna) ప్రధాన పాత్రల్లో కోలీవుడ్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్‌(AR Muragadoss) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘సికందర్‌’ (Sikandar). రంజాన్ కానుకగా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌(
Trailer release event) నిర్వహించారు. ఈ వేడుకలోనే హీరో హీరోయిన్ల వయసు తేడా గురించి ప్రశ్న ఎదురవగా సల్మాన్‌ ఖాన్ స్పందించాడు. ఆమెకు లేని ఇబ్బంది మీకెందుకు? అని ఎదురు ప్రశ్నించారు.

‘‘నాకు, హీరోయిన్‌కి మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని కొందరు అంటున్నారు. హీరోయిన్‌కు గానీ, ఆమె తండ్రికి గానీ లేని సమస్య మీకెందుకు? రష్మికకు పెళ్లై పాప పుడితే ఆమె కూడా బిగ్‌ స్టార్‌(Big Star) అవుతుంది. కలిసి నటిస్తాం. అప్పుడు కూడా.. తల్లిగా రష్మిక అనుమతి తప్పనిసరిగా తీసుకుంటా’’ అని సమాధానమిచ్చారు. దీంతో స్టేజీ మీద ఉన్న వారంతా నవ్వారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా(SM)లో వైరల్ అవుతోంది. ఈ మూవీలో సత్యరాజ్(Satya raj), కాజల్ అగర్వాల్(Kajal Agarwal) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా మురుగదాస్ చాలా గ్యాప్ తర్వాత ఈ మూవీని తెరకెక్కించాడు.

Salman Khan's Latest Song Sikandar Naache: Fans Reactions | Bollywood Bubble

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *