Joseph Prabhu: విషాదం.. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత

స్టార్ హీరోయిన్, సినీ నటి సమంత(Samantha) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు(Joseph Prabhu) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సామ్ సోషల్ మీడియా(Social Media) వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా సమంత ఓ క్యాప్షన్ కూడా రాశారు. “నాన్నను ఇక కలవలేను” అంటూ హార్ట్ బ్రేకింగ్ ఏమోజీతో స్టోరీ పెట్టింది. అయితే తన తండ్రి మృతికి గల కారణాలను వెల్లడించలేదు. దీన్ని చూసిన సామ్(Sam) అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. అటు సమంత తండ్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

 ఎప్పుడూ తండ్రి గురించే చెబుతుండేది..

కాగా, తనపై తన తండ్రి ప్రభావం ఎంతో ఉందని గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూలలో సమంత చెప్పిన విషయం తెలిసిందే. చెన్నై(Chennai)లో జోసెఫ్ ప్రభు, నీనెట్ ప్రభు(Joseph Prabhu, Ninet Prabhu) దంపతులకు 1987 April 28న సమంత జన్మించారు. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో-ఇండియన్. కాగా సమంత ఎప్పుడూ తన తండ్రి గురించి చెబుతూ ఉండేది. ప్రతి విషయంలోనూ తన తండ్రి తనకు అండ దండగా ఉన్నారని, మద్దతుగా నిలిచారని అప్పట్లో పేర్కొంది.

 గతంలో ఫేస్‌బుక్ ద్వారా జోసెఫ్ ఆవేదన

మరోవైపు సామ్ తండ్రి జోసెఫ్ ప్రభు గతంలో ఫేస్‌బుక్(Facebook) ద్వారా సామ్-నాగ చైతన్య(Sam-Naga Chaitanya)ల పెళ్లిఫొటోలను పంచుకున్నారు. వీరిద్దరి విడాకుల అనంతరం దాదాపు ఏడాది తర్వాత అతడు రియాక్ట్ అయ్యాడు. చైతు,సామ్ ఫొటోలు పంచుకుంటూ.. గతంపై తన ఆవేదనను వ్యక్తపరిచాడు. వారిద్దరూ విడాకులు తీసుకున్న విషయాన్ని అంగీకరించడానికి తనకు చాలా కాలం పట్టిందని చెప్పుకొచ్చాడు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *