Sodara: సమ్మర్‌ స్పెషల్‌గా సంపూర్ణేష్ బాబు ‘సోదరా’.. రిలీజ్ ఎప్పుడంటే?

వైవిధ్యమైన కథలతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేయడంలో ముందుంటాడు హీరో సంపూర్ణేష్‌ బాబు(Sampuranesh Babu). తన మేనరిజమ్‌తో అభిమానుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో సాగే ‘సోదరా(Sodara)’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సంపూర్ణేష్ బాబుతో పాటు సంజోష్‌(Sanjosh) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ సమ్మర్ హాలిడేస్ కానుకగా ఏప్రిల్‌ 11న ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్(Promotions) కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఆ సాంగ్‌కు 1.1 మిలియన్ వ్యూస్

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్(Poster), 4 పాటల(Songs)కు మంచి స్పందన లభిస్తోంది. ‘తెలుగు చిత్రసీమలో ఎందరో సోదరులు ఉన్నారు అలాంటి సోదరులందరినీ బంధాన్ని అద్దం పట్టేలా చూపించడానికి ఈ సోదరా వస్తోంది. తప్పకుండా మా సోదరా చిత్రం ఈ వేసవికి ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుందనే నమ్మకం ఉంది’ అని డైరెక్టర్ అన్నారు. కాగా ఈ మూవీలోని ‘నను జూసీనావే పిల్లా.. నా కలలే నిజమయ్యేలా’ అనే సాంగ్ 1.1 మిలియన్ వ్యూస్ సాధించింది.

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌పై దృష్టి

ఇప్ప‌టికే షూటింగ్(Shooting) కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌పై దృష్టిసారించింది. మన్మోహన్‌ మేనంపల్లి(Manmohan Menampally) దర్శకత్వంలో క్యాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకం(Can Entertainments Banner)పై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ అన్నదమ్ముల బంధం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు అలాంటి అన్నదమ్ముల బంధాన్ని వెండితెరపై మనకు ఆవిష్కరించబోతున్న చిత్రమే ‘సోదరా’ చిత్ర‌మ‌ని అన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *