Pawan Kalyan: సముద్రఖనితో పవన్ సినిమా!

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్న పవన్.. ప్రస్తుతం సుజీత్ తెరకెక్కిస్తున్న‘ఓజీ’ (OG) మూవీ షూటింగ్లో పాల్గొంటున్నారు. త్వరలోనే ఆ చిత్రం కూడా పూర్తికానుందని మేకర్స్‌ వెల్లడించారు. మరోవైపు హరీశ్‌ శంకర్‌ తీస్తున్న‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ షూటింగ్‌ లోనూ పాల్గొంటున్నారు. ఈ చిత్రాలతో బిజీగా ఉన్న పవర్స్టార్ కొత్త కథలు వింటున్నట్లు టాక్‌ నడుస్తోంది.

ఇచ్చిన మాట ప్రకారం..

పవన్తో ‘బ్రో’ సినిమా తీసిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని (Samuthirakani) ఆయనకు తాజాగా ఓ కథ చెప్పారట. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘బ్రో’ పవన్‌ ఫ్యాన్స్‌ను మెప్పించింది. దీంతో అప్పట్లోనే సముద్రఖనితో మరో సినిమా చేస్తానని పవన్‌ మాటిచ్చారట. ఇప్పుడు అది పట్టాలెక్కబోతోందని తెలిసింది. పలు సినిమాల కోసం పవన్‌కు ఇప్పటికే కొంతమంది నిర్మాతలు అడ్వాన్స్‌ ఇచ్చారు. కానీ ఆయన పార్టీ పనులతో బిజీ కావడం, సినిమాలకు కొంత గ్యాప్‌ ఇవ్వంతో కొందరికి అడ్వాన్స్‌లు తిరిగి ఇచ్చేశారు. అందులో కొంత మందికి ఇవ్వాల్సి ఉండగా.. వారిలో ఓ నిర్మాత కోసం ఇప్పుడీ సినిమా చేయబోతున్నారని సమాచారం. ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ (Ustaad Bhagat Singh) పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.

హరి హర వీరమల్లు రిలీజ్ ఎప్పుడు?

క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్షన్లో పవన్ నటించిన ‘హరి హర వీరమల్లు’ జూన్ 12న విడుదల కావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడింది. అయితే చిత్ర బృందం ఇప్పటివరకు కొత్త రిలీజ్ డేట్ను మాత్రం ప్రకటించలేదు. రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా? తమ అభిమాన నటుడి మూవీని ఎప్పుడు చూస్తామా అని పవర్స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *