Mana Enadu: సంజూ శాంసన్(Sanju Samson).. ప్రపంచ క్రికెట్లో ఈ పేరు తెలియని అభిమానులు ఉండరు. కానీ దురదృష్టం మాత్రం సంజూ వెంటే ఉండేది. ఎందుకంటే క్రికెట్(Cricket)లో పైకి రావాలంటే టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు. ఇసుమంత అదృష్టం(Luck) కూడా ఉండాలని క్రీడా విశ్లేషకులు తరచూ చెబుతున్న మాట. పైగా సంజూ లాంటి గురించి తెలిసిన వాళ్లు ఇది నిజమేనని ఒప్పుకోకమానరు. భారత్‌లో ప్రస్తుతం ఉన్న బెస్ట్ బ్యాటర్స్‌లో అతనొకడు. బ్యాటింగ్ ఒక్కటే కాదు.. వికెట్ కీపింగ్ ఎబిలిటీస్ కూడా ఉన్నాయి. IPLలో ఓ టీమ్‌కు గత కొన్ని సీజన్లుగా కెప్టెన్‌గా ఉంటూ సారథ్యంలోనూ ఆరితేరాడు.
9 ఏళ్లలో ఏడుగురు కెప్టెన్సీల్లో..
శాంసన్ ఎప్పుడూ కూల్‌గా ఉంటూ, ఇతర ఆటగాళ్ల మీద కూడా ఒత్తిడి పడకుండా చూసుకుంటాడతను. నేచురల్ బ్యాటింగ్(Natural batting)ను పక్కనబెట్టి టీమ్ అవసరాలకు తగ్గట్లు ఆడుతుంటాడు. IPL సహా ఇంటర్నేషనల్ లెవల్లో ఎప్పుడు ఛాన్స్ వచ్చినా పరుగుల వరద పారిస్తుంటాడు. ఎంతో టాలెంట్ ఉన్న ఆ ప్లేయర్‌కు తరచూ అన్యాయం జరిగేది. అప్పుడెప్పుడో 9 ఏళ్ల కింద India T20 జట్టులోకి అతడు ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 34 మ్యాచుల్లో మాత్రమే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ తొమ్మిదేళ్లలో టీ20ల్లో ఏడుగురు కెప్టెన్లు ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీల్లో ఆడాడు. తాజాగా సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సారథ్యంలోనూ ఆడుతున్నాడు. కాగా పొట్టి ఫార్మాట్లో సంజూ 30 ఇన్నింగ్స్‌ల్లో 701 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు, మరో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Sanju Samson
ఇలాంటి ప్లేయర్ల కోసమే చూస్తున్నాం: సూర్య
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా(South Africa)తో మ్యాచ్ అనంతరం సంజూ మాట్లాడారు. T20ల్లో ఫామ్ కొనసాగిస్తూ వరుసగా 2 సెంచరీలు చేయడం ఆనందంగా ఉందన్నాడు. ‘ఈ క్షణం కోసం పదేళ్లుగా ఎదురుచూశా. చాలా సంతోషంగా ఉంది. ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తే నేను ఎమోషనల్ అవుతానేమో. కానీ ఈ ఆనంద క్షణాలను ఎంతో ఎంజాయ్ చేస్తున్నా’ అని తెలిపాడు. అటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శాంసన్‌పై ప్రశంసలు కురిపించాడు. కొన్నేళ్లుగా కఠోర శ్రమ చేస్తున్న అతనికి ఇప్పుడు దాని ఫలితాలు అందుతున్నాయన్నాడు. జట్టు కోసం ఆడే వ్యక్తి అతనని కొనియాడాడు. తాము అలాంటి వారికోసమే చూస్తున్నామని పేర్కొన్నాడు.
He really did jt twice and proved that it’s not luck it’ talent
— omkesh chaturvedi (@omkesh0512) November 9, 2024








