విక్టరీ వెంకటేశ్(Venkatesh), ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’. ఈ పొంగల్‌కి ఫ్యామిలీ ఎంటైర్‌టైనర్‌గా కడుపుబ్బా నవ్వించేందుకు జనవరి 14న తెలుగురాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ రిలీజ్ అయింది. తొలి షో నుంచి కుటుంబ ప్రేక్షకులు వెంకీమామ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్(Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించంగా, శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు(Dil Raju నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటికొచ్చింది.
వన్ మిలియన్ క్లబ్‌లో చేరడం ఖాయం: ఫ్యాన్స్
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్(Overseas)లోనూ ఈ చిత్రం రిలీజైంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ‘F2’ తరహాలో తన టిపికల్ మార్క్ కామెడీతో అనిల్ రావిపూడి ఈ మూవీని తీశాడు. చాలా వరకు కామెడీ(Comady) వర్కౌట్ అయిందని మెజారిటీ జనాలు అంటున్నారు.ఓవర్సీస్‌లో ఈ చిత్రం తొలి రోజు 7లక్షల డాలర్లు రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా(Social Media) ద్వారా వెల్లడించింది. కాగా.. వెంకటేష్ కెరీర్‌లోనే తొలి రోజు ఓవర్సీస్(First day overseas)లో ఈ స్థాయి కలెక్షన్లు(Collections) రావడం ఇదే తొలిసారి అని తెలిపింది. దీంతో వెంకీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ చిత్రం వన్ మిలియన్ క్లబ్(One Million Club)లో చేరడం ఖాయం అని కామెంట్లు పెడుతున్నారు.
𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 𝐏𝐎𝐍𝐆𝐀𝐋𝐔𝐔..❤️🔥#SankranthikiVasthunam Captivates North America audiences, Surpasses $700K gross mark and going strong 💥
Extra locations & shows are being added On demand🎟️
Victory @VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/GJDlr0IXuq
— Sri Venkateswara Creations (@SVC_official) January 15, 2025







