విక్టరీ వెంకటేశ్ (Venkatesh) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) థియేటర్లలో జోరు చూపిస్తోంది. ఐశ్వర్యా రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. రిలీజ్ అయిన తొలి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తో సూపర్ హిట్ రికార్డు వసూళ్లు రాబడుతోంది. అలా ఈ సంక్రాంతి విన్నర్ గా విక్టరీ వెంకటేశ్ ను నిలబెట్టింది ఈ సినిమా.
వెంకీ కెరీర్ లో ఆల్ టైమ్ హిట్
విడుదలైన మూడ్రోజుల్లోనే గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్క్‌ను అధిగమించి అరుదైన ఫీట్ సాధించింది ఈ సినిమా. ఇక తాజాగా మరో అరుదైన ఫీట్ నమోదు చేసింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లు (Sankranthiki Vasthunam Collections) రాబట్టి వెంకటేశ్ కెరీర్ లో ది బెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి, వెంకటేశ్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ హ్యాట్రిక్ కాంబోలో విడుదలై నార్త్ అమెరికాలో-2.3 మిలియన్ డాలర్లు (రూ.19 కోట్లకుపైగా) రాబట్టింది. అలా యూఎస్‌ఏలో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా నిలిచింది.
Yeah @VenkyMama #VictoryVenkatesh Smashed His All Time Career Best 🔥🔥 #SankranthikiVastunnam World Wide 200 Crore Gross + Counting . pic.twitter.com/knRVDKwZO0
— BA Raju’s Team (@baraju_SuperHit) January 20, 2025
హౌస్ ఫుల్ బోర్డుతో వెంకీ జోరు
వెంకటేశ్ హీరోగా.. ఐశ్వర్య, మీనాక్షి (Meenakshi CHowdary) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా థియేటర్లలో ఇంకా హౌస్ ఫుల్ బోర్డులతో నడుస్తోంది. ఇందులో వెంకీ కామెడీ టైమింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే ఓవైపు భార్య, మరోవైపు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య నలిగిపోయే పాత్రలో ఆయన తన నటనతో మెస్మరైజ్ చేశారు. ఇక వెంకీ కొడుకుగా బుల్లిరాజు పాత్రలో రేవంత్ నటనకు థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోల చేస్తున్నారు. ఇక ఈ సినిమా దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన విషయం తెలిసిందే.






