తాగిన మత్తులో ‘జైలర్’ విలన్ వీరంగం.. వీడియో వైరల్

‘జైలర్ (Jailer Movie)’ సినిమాలో ‘వర్త్ వర్మా వర్త్’.. అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయిన విలన్ వినాయకన్ (Vinayakan). ఈ మలయాళ నటుడు తన విలన్ రోల్స్ తోనే కాదు.. రియల్ లైఫ్ లో పలు వివాదాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు.  గతంలో తప్ప తాగి పోలీసులతో గొడవ పడి అరెస్టయిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఫుల్లుగా మందు తాగి తన ఇంటి మేడపై అర్ధనగ్నంగా తిరుగుతూ ఇరుగు పొరుగు వారితో గొడవ పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

వినాయకన్ వీడియో వైరల్

ఈ వీడియోలో వినాయన్ (Vinayakan Video Viral) కేవలం లుంగీపైనే ఉన్నాడు. పైన షర్ట్ ఏం ధరించకుండా అర్ధనగ్నంగా మేడపై అటూ ఇటూ తిరుగుతూ పక్కింటి వారితో గొడవపడ్డాడు. లుంగీ జారిపోతున్నా చూసుకోకుండా కంట్రోల్ లేకుండా ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించాడు. ఇలా అసభ్యకరంగా ప్రవర్తించడంపై ప్రశ్నించగా ఇరుగు పొరుగును బూతులు తిడుతూ నానా రభస చేశాడు. దీంతో చుట్టుపక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి

ఇప్పుడు వినాయకన్ విపరీత ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాల్లో విలన్ రోల్స్ చేస్తూ పాపులారిటీ తెచ్చుకున్న ఈ నటుడు ఇప్పుడు తన ప్రవర్తనతో ఇలా తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. మరోవైపు పదే పదే ఇండస్ట్రీ పరువు తీసే విధంగా ప్రవర్తిస్తున్న వినాయకన్‌ను సినిమాల్లో నటించకుండా బహిష్కరించాలి అంటూ కొందరు డిమాండ్‌ చేస్తున్నారు.

Related Posts

Rajamouli: ఏంటి బ్రో.. సమయం, సందర్భం ఉండక్కర్లే.. అభిమానిపై రాజమౌళి ఫైర్

ఈ మధ్య చాలా మందికి స్మార్ట్ ఫోన్(Mobile) చేతిలో ఉండే సరికి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలియడం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీ (Celebrities)ల విషయంలో ఈ మధ్య అభిమానులు ప్రవర్తిస్తున్న తీరు వారికి చిరాకు తెప్పిస్తున్న విషయం తెలిసిందే. వారు…

Allu Aravind: బ్యాంక్ రుణ మోసం కేసు.. అల్లు అరవింద్‌ను విచారించిన ఈడీ

తెలుగు సినీ పరిశ్రమలో ఈడీ(Enforcement Directorate) కలకలం రేపింది. ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌(Allu Aravind)ను ED అధికారులు విచారించారు. హైదరాబాద్‌కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ(Ramakrishna Electronics Company)కు సంబంధించిన రూ.101 కోట్ల బ్యాంక్ రుణ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *