తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో వింటేజ్ వెంకటేశ్(Venkatesh) మాస్ ర్యాంపేజ్ కొనసాగుతుంది. ఈ పొంగల్ కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం(Sankrantiki Vasthunnam)’ మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఐశ్వర్య రాజేశ్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. అటు ఓవర్సీస్లోనూ ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించంగా, శ్రీ వేంకటేశ్వర బ్యానర్‌పై దిల్‌రాజు(Dil Raju) నిర్మించారు. తాజాగా ఈ మూవీ కలెక్షన్లపై మేకర్స్ స్పందించారు.
వసూళ్లు మరింత పెరిగే అవకాశం
కంప్లీట్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్(A Family Entertainer)గా తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ భారీ వసూళ్లు కొల్లగొడుతోంది. రిలీజైన ఫస్ట్ షో నుంచే వెంకీమామ ఫ్యాన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. ఓవర్సీస్లో ఈ చిత్రం విడుదలైన రోజే 7లక్షల డాలర్లు రాబట్టింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై 4 రోజుల్లోనే రూ.131 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇవాళ, రేపు వీకెండ్స్ కావడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా.. వెంకటేష్ కెరీర్లోనే తొలి రోజు ఓవర్సీస్(First day overseas)లో ఈ స్థాయి కలెక్షన్లు(Collections) రావడం ఇదే తొలిసారి అని తెలిపింది.
Audiences across the globe are celebrating their favourite film of this festive season ❤️
A HUMUNGOUS 131+ Crores Gross Worldwide in 4 Days for #BlockbusterSankranthikiVasthunam 🔥🔥
— https://t.co/ocLq3HYNtH#SankranthikiVasthunam IN CINEMAS NOW 🫶
Victory @venkymama… pic.twitter.com/0PY7FoRpWm
— Sri Venkateswara Creations (@SVC_official) January 18, 2025







