‘సంక్రాంతికి వస్తున్నాం’ అరుదైన ఫీట్.. RRR తర్వాత రెండో మూవీగా రికార్డు

ఈ సంక్రాంతి పండుగకు విడుదలైన మూడు సినిమాల్లో విక్టరీ వెంకటేశ్ (Venkatesh) నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా పాజిటివ్ టాక్ తో.. భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జనవరి 14వ తేదీ నుంచి థియేటర్లలో సందడి చేస్తూ పలు రికార్డులు తన ఖాతాలో వేసుకుంటోంది. తాజాగా ఈ చిత్రం మరో అరుదైన ఫీట్ అందుకుంది. ఏకంగా ఓ విషయంలో ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇంతకీ ఎందులో అంటే..?

రెండో సినిమాగా రికార్డు

‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ సినిమా రిలీజ్ నుంచి థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులే కనిపిస్తున్నాయి. అందుకే ఈ చిత్రం ఐదో రోజు కూడా భారీ వసూళ్లు రాబట్టింది. ఏకంగా  రూ.12.75 కోట్లు వసూలు చేసింది. ఇలా ఆంధ్ర, సీడెడ్‌, నైజాం ప్రాంతాల్లో ఐదో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. ఈ వసూళ్లలో మొదటి స్థానంలో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (రూ.13.63 కోట్లు) ఉండగా, రెండో స్థానంలో సంక్రాంతికి వస్తున్నాం (రూ.12.75కోట్లు) నిలిచిందని ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి.

అనిల్-వెంకీ హ్యాట్రిక్ 

తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ సంక్రాంతికి వస్తున్నాం వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. అక్కడ ఈ సినిమా వెంకటేశ్‌ కెరీర్‌లోనే ఆల్‌టైమ్‌ వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఓవర్సీస్‌లో తొలిరోజు ఈ చిత్రం 7 లక్షల డాలర్లు రాబట్టినట్లు వెల్లడించిన టీమ్‌ తాజాగా అక్కడ రెండు మిలియన్‌ డాలర్లు సాధించినట్లు వెల్లడించింది.  మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలుగా నటించిన ఈ సినిమాతో అనిల్ రావిపూడి (Anil Ravipudi)-వెంకటేశ్ కాంబో హ్యాట్రిక్ కొట్టింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *