VT15 ఫస్ట్ లుక్.. ఇండో-చైనీస్ హార్రర్ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం వేచి చూస్తున్నాడు. ఇటీవలే విడుదలైన మట్కా (Matka) సినిమా ఎన్నో అంచనాలతో వచ్చినా.. అట్టర్ ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. చాలా కాలంగా వరుణ్ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఇక తన నెక్స్ట్ మూవీని అందరికీ ఇష్టమైన హార్రర్ కామెడీ జానర్ లో తీయాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలో తాజాగా వరుణ్ తేజ్ తన పుట్టిన రోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా ప్రకటించాడు.

VT15 ఫస్ట్ లుక్ (VT15 First Look) ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. డ్రాగన్ డిజైన్ ఉన్న జాడీపై కోడ్‌ లాంగ్వేజ్‌తో ఉన్న క్లాత్‌ మంటలు అంటుకొని కనిపించడం ఈ పోస్టర్ లో చూడొచ్చు.  ఈ పోస్టర్ చూస్తుంటే సస్పెన్స్, కామెడీ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతుందని అర్థమవుతోంది. మరోవైపు ఈ పోస్టర్ కింద వేట హాస్యాస్పదంగా మారితే అంటూ క్యాప్షన్ ఇవ్వడం ఈ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.

ఇండో-చైనీస్ హార్రర్‌ కామెడీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా ఉండబోతుందని తాజా లుక్‌తో క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌. ఈ సినిమాకు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్ రాజా (Express Raja), ఏక్‌ మినీ కథ లాంటి సినిమాలతో హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది.  ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, షూటింగ్‌, రిలీజ్‌ అప్‌డేట్స్ త్వరలో వెల్లడించనున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *