పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ జంట క్వార్టర్‌ఫైనల్స్‌లో 21-12, 21-19తో మలేసియాకు చెందిన ఆరోన్ చియా, సో వూయి ఇక్ జోడీపై విజయం సాధించింది. తొలగేమ్ నుంచే ఆధిపత్యం చెలాయించిన ఈ జోడీ ప్రత్యర్థులను మట్టికరిపించి సెమీస్‌లో స్థానం సంపాదించింది. వారి సమన్వయం, శక్తివంతమైన స్మాష్‌లు, వ్యూహాత్మక ఆటతీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ విజయంతో భారత్‌కు కనీసం కాంస్య పతకం ఖాయమైంది.
History Repeated , But With A Twist !!!
Same Venue , Same Opponent , Same Round But A Different Outcome . The Indian Duo Successfully Avenged Their Olympic Quarterfinal Defeat At The World Championships . Congrats SatChi , Best Of Luck For Semis ❤️ #BWFWorldChampionships2025 https://t.co/8gC6IUpB6q pic.twitter.com/Rk7vk3NWXl
— Badminton Media (@BadmintonMedia1) August 30, 2025
సింధుకు మళ్లీ నిరాశే..
మరోవైపు, మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu) క్వార్టర్‌ఫైనల్స్‌లో ఓటమితో నిష్క్రమించింది. క్వార్టర్ఫైనల్లో ఆమె 14-21, 21-13, 16-21తో రెండో సీడ్ పుత్రి కుసుమవర్దని (Indonasia) చేతిలో పోరాడి ఓడింది. కీలక సమయాల్లో ఒత్తిడిని అధిగమిస్తూ పాయింట్లు రాబట్టిన 23 ఏళ్ల కుసుమవర్దని.. కెరీర్లో మొదటి ప్రపంచ పతకాన్ని ఖాయం చేసుకుంది. తొలి గేమ్‌లో గొప్పగా పోరాడిన సింధు రెండు, మూడు సెట్లలో దారుణంగా విఫలమైంది. ఇతర భారత ఆటగాళ్లలో ధ్రువ్ కపిలా-తనీషా క్రాస్టో జోడీ కూడా క్వార్టర్స్‌లో ఓడిపోయింది. సాత్విక్-చిరాగ్ జోడీ సెమీఫైనల్ ప్రదర్శనపై ఇప్పుడు భారత అభిమానుల ఆశలు నెలకొన్నాయి. వారు అదే ఫామ్ కొనసాగిస్తే భారత్‌కు మరో చారిత్రక విజయం దక్కే అవకాశం ఉంది.
Well Played Sindhu ❤️ #BWFWorldChampionships2025 https://t.co/iyC9qZSALU pic.twitter.com/Ypeaqc1Swj
— Badminton Media (@BadmintonMedia1) August 29, 2025






