రోజుకు రూ. 411 సేవ్ చేస్తే మీ చేతికి రూ. 43 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే!

పోస్టాఫీస్‌(PostOffice) లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) పథకం చాలా మంచి ఎంపికగా నిలుస్తుంది. తక్కువ మొత్తంతో ప్రారంభించి, ఎక్కువ లాభాన్ని పొందాలనుకునే వారు, అలాగే పన్ను మినహాయింపు కావాలనుకునేవారికి, పొదుపు చేయాలనుకునేవారికి ఈ పథకం ఎంతో ప్రయోజనకరం.

రోజుకు రూ. 411 సంవత్సరం చివరికి రూ. 1.5 లక్షలు

PPF ఖాతా కాలపరిమితి 15 సంవత్సరాలు. ప్రస్తుతం ఇది 7.9% వార్షిక వడ్డీని అందిస్తోంది. మీరు నెలకు రూ.12,500 లేదా రోజుకు సగటున రూ.411 చొప్పున డిపాజిట్ చేస్తే, ఏడాదికి రూ.1.5 లక్షలు సేవ్ అవుతాయి. ఈ విధంగా 15 ఏళ్లలో మీరు సుమారుగా రూ.43.60 లక్షలు పొందవచ్చు. ఇందులో రూ.21 లక్షలు వడ్డీ రూపంలో లభిస్తాయి.

పన్ను మినహాయింపు, పూర్తి భద్రత

PPFలో పెట్టుబడి చేసిన మొత్తం, దానిపై లభించే వడ్డీ రెండూ ఆదాయపన్ను శాఖ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపును పొందుతాయి. అంతేకాదు, ఇది భారత ప్రభుత్వం మద్దతుతో నడిచే పథకం కావడంతో పెట్టుబడి పూర్తిగా భద్రతతో ఉంటుంది. బ్యాంకు FD కంటే ఎక్కువ వడ్డీ ఉండటంతో దీన్ని చాలా మంది సెలెక్ట్ చేస్తున్నారు.

డిపాజిట్ పద్ధతులు సులభం

మీరు ఒకేసారి మొత్తం డిపాజిట్ చేయవచ్చు లేదా నెలవారీగా 12 వాయిదాలలో కూడా డబ్బు చెల్లించవచ్చు. ఇకపోతే, IPPB యాప్ లేదా DakPay App ద్వారా మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు బదిలీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది.

రుణం తీసుకునే అవకాశమూ ఉంది

PPF ఖాతా ప్రారంభించిన ఐదేళ్ల లోపల అత్యవసర పరిస్థితుల్లో మీరు దానిపై రుణం తీసుకునే సదుపాయం కూడా ఉంది. దీని వలన మీరు డబ్బు తీసుకునే అవసరం వచ్చినప్పుడు ఖాతా క్లోజ్ చేయకుండా అవసరాన్ని తీర్చుకోవచ్చు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *