SBI Job Notification: ఎస్‌బీఐలో 14,191 ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

నిరుద్యోగుల(The Unemployes)కు అదిరిపోయే శుభవార్త. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వేలల్లో ఖాళీల భర్తీకి ప్రకటన వదిలి నిరుద్యోగులకు ట్రీట్ అందించింది. దాదాపు 14,191 క్లర్క్ (Junior Associate Customer Support & Sales) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్(Notification) రిలీజ్ చేసింది. డిగ్రీ అర్హతతో అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్(Online) ద్వారా అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ మొత్తం ఖాళీల్లో తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణలో ఎక్కువగా పోస్టులు ఉన్నాయి. అందులో APలో 50, TGలో 342 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునేందుకు మరో 2 రోజులే ఛాన్స్ ఉంది. జనవరి 7తో గడువు ముగుస్తుంది.

అర్హతలు ఇవే..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్(Degree) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, OBC అభ్యర్థులకు 3ఏళ్లు, PWBD అభ్యర్థులకు 10ఏళ్ల వరకు వయోపరిమితితో సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్(Preliminary, Main Exams) ద్వారా ఎంపిక చేస్తారు.

ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడే..

AP: గుంటూరు, అనంతపురం, విజయవాడ, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, కడప, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

Telangana: హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌లో ఏర్పాటు చేయనున్నారు.

అప్లికేషన్ లింక్

https://sbi.co.in/web/careers/current-openings

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *