
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బీఐ(SBI)లో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ షురూ అయింది. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో ఐదు వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ (Customer Support and Sales) పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆగస్టు 6 నుంచి 26వ తేదీ వరకు IBPS అధికారిక వెబ్‌సైట్ https://ibpsonline.ibps.in/sbijajul25/ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్(Notification) కింద 5,180 రెగ్యులర్ పోస్టులతో పాటు కొన్ని బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో ఏపీలో 310 పోస్టులు ఉండగా.. తెలంగాణ పరిధిలో 250 రెగ్యులర్ పోస్టులు ఉన్నాయి.
అర్హతలు ఇవే
☛ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు తప్పనిసరి.
☛ అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్లు మించరాదు (2025 ఏప్రిల్ 1 నాటికి ). రిజర్వేషన్ల ఆధారంగా ఆయా వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
☛ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, డిసెంబర్ 31 కంటే ముందే సంబంధిత ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.
☛ సెలక్షన్ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్.
అప్లికేషన్ ఫీజు ఎంతంటే..
☛ జనరల్/EWS/OBC అభ్యర్థులకు రూ.750 ఉంటుంది. ఇక SC/ST/దివ్యాంగులకు ఎలాంటి రుసుం లేదు. ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి..
ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ నెలలో ఉంటుంది. మెయిన్ పరీక్ష నవంబర్‌లో జరిగే అవకాశముంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే..
☛ అనంతపురం, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, వైజాగ్, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
SBI Clerk Recruitment 2025
Vacancies: 5180 Posts
Click on the link for details: https://t.co/OhffZ2U3ko#jobs #job #sbijobs pic.twitter.com/dfzMTgnwGm— Govt Jobs Portal – Latest Govt Jobs in India (@Jobsportalforu) August 5, 2025