SSMB29లో సెకండ్ హీరోయిన్ ఫిక్స్? మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేయబోతున్న స్టార్ బ్యూటీ!

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), రాజమౌళి(SS, Rajamouli) కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్టు ఎస్‌ఎస్‌ఎంబీ 29(SSMB29)పై భారీ అంచనాలున్నాయి. పాన్-వరల్డ్ లెవెల్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి వరుసగా అప్డేట్స్‌ వస్తున్నాయి. ఇప్పటికే గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. ప్రాజెక్టులో భాగంగా ప్రియాంక డ్యాన్స్ ట్రైనింగ్‌ కూడా తీసుకుంటుండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాకి రాజమౌళి ప్రతి నటుడికి ప్రత్యేక డైట్ ప్లాన్ ఇచ్చారట. అంతగా శ్రమించి రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పుడు మరో ఇంట్రస్టింగ్ బజ్ వైరల్ అవుతోంది. అదే సెకండ్ హీరోయిన్(Second Heroin) గురించి. తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ బడ్జెట్ సినిమాలో శృతిహాసన్‌ను సెకండ్ లీడ్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

రాజమౌళి పలు ఇంటర్వ్యూలలో శృతిహాసన్(Sruthi Hassan) డ్యాన్సింగ్ స్కిల్స్, ఎమోషనల్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి ప్రశంసలు గుప్పించారు. ఆమె రొమాంటిక్ పాత్రలతో పాటు సీరియస్ పాత్రల్లోనూ చక్కగా నటిస్తారని అభిప్రాయపడ్డారు. గతంలో మహేష్ బాబు, శృతిహాసన్ కాంబినేషన్‌లో వచ్చిన “శ్రీమంతుడు” సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు అదే కాంబో మళ్లీ తెరపైకి రానుండడం అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని నింపుతోంది.

రాజమౌళి సినిమాల్లో ప్రతి ఎంపిక వెనక వ్యూహమే ఉంటుంది. శృతిని ఈ సినిమాలో తీసుకోవడంలోనూ అదే డెప్త్ ఉందని భావిస్తున్నారు సినీ వర్గాలు. ఆమె పాత్ర ఎలా ఉండబోతుందో ఇంకా అధికారిక సమాచారం రాలేదు కానీ, ఈ కాంబినేషన్ సినిమాకి ఓ మేజిక్ లా పనిచేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

 

 

View this post on Instagram

 

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *