
సంగారెడ్డి జిల్లా పాశమైలారం(Pashamailaram)లో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరింది. మరో 35 మందికిపైగా గాయపడ్డట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వెలికితీసిన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అటు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు ప్రాథమికంగా ఉన్న సమాచారం. కాగా గాయపడిన వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. 55 మంది క్షేమంగా ఉండగా, మరో 27 మంది ఆచూకీ లభించలేదు.
దాదాపు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు..
కాగా సోమవారం ఉదయం పాశమైలారం రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సిగాచి రసాయన పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్ పేలడం(Reactor explosion)తో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పలువురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో సంఘటన స్థలిలోనే ఐదుగురు మృతి చెందగా.. మరో 14 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్లాంట్ వైస్ ప్రెసిడెంట్ LN గోవన్ కూడా దుర్మరణం పాలయ్యారు. పేలుడు ధాటికి కార్మికులు(workers) దాదాపు 100 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. పేలుడు తీవ్రతకు ఉత్పత్తి విభాగం ఉన్న భవనం కూలిపోగా.. మరో భవనానికి బీటలు వచ్చాయి. సమాచారం అందుకున్న కార్మికుల కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో అక్కడి పరిస్థితి భీతావహంగా మారింది.
నేడు ఘటనాస్థలికి సీఎం రేవంత్
కాగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు దామోదర్ రాజనర్సింహ, గడ్డం వివేక్‌లు పరామర్శించారు. బాధిత కుటుంబాల సభ్యులకు ధైర్యం చెప్పారు. ప్రమాద ఘటనను రాజకీయం చేయొద్దని కోరారు. మరోవైపు సీఎం రేవంత్(CM Revanth) ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కాగా నేడు ఘటనాస్థలి సీఎం పరిశీలించనున్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా(Ex-gratia) ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సిగాచి ప్రమాద బాధితుల కోసం సంగారెడ్డి కలెక్టరేట్(Sangareddy Collectorate)లో కంట్రోల్ రూమ్(Control Room) ఏర్పాటు చేశారు. ప్రమాద బాధితుల వివరాల కోసం 08455276155ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
Hon’ble Chief Minister @revanth_anumula garu expressed his deepest condolences and prayers for the loved ones and families of those who lost their lives in today’s tragic accident at a chemical factory in #Pashamylaram, Sangareddy District.
The Chief Minister has instructed the… pic.twitter.com/syfODgbjJL
— Telangana CMO (@TelanganaCMO) June 30, 2025