ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టును ఛాంపియన్(Champion)గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన జట్టు ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్(Yash Dayal) ప్రస్తుతం పెద్ద సమస్యలో చిక్కుకున్నాడు. UP ఘజియాబాద్‌లోని ఇందిరాపురానికి చెందిన ఓ యువతి, యశ్ దయాల్‌పై లైంగిక దాడి ఆరోపణలు(Allegations of sexual assault) చేసింది. దీంతో పోలీసులు కేసు(Police Case) కూడా నమోదు చేశారు. కాగా సదరు యువతి తన సోషల్ మీడియా(Socia Media) ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్(Post) చేసింది. అందులో యశ్ దయాల్ పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించి తనను ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆరోపించింది.
యశ్‌తో చేసిన వాట్సాప్ చాట్ బయటపెట్టిన యువతి
ఈ పోస్ట్‌లో ఆమె యశ్ దయాల్‌తో ఉన్న ఫొటో(Photo)ను కూడా పంచుకుంది. గత 5 సంవత్సరాలుగా యశ్ దయాల్‌తో సంబంధం ఉందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. తనను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు, దయాల్ తనను శారీరకంగా, మానసికంగా(Physically, mentally) వేధించాడని కూడా ఆరోపించింది. ఇది మాత్రమే కాదు, యశ్ దయాల్ తనతో పాటు ఇంకా చాలా మంది అమ్మాయిలతో సంబంధం కలిగి ఉన్నాడని ఆ యువతి ఆరోపించింది. దీనికి రుజువుగా వారిద్దరి వాట్సాప్ చాట్(WhatsApp chat)ల స్క్రీన్‌షాట్‌లు, వీడియో కాల్స్, ఫొటోలను పోలీసులకు సమర్పించింది.
నేరం రుజువైతే క్రికెట్ కెరీర్‌కు ముగింపే..
ప్రస్తుతం పోలీసులు ఈ విషయంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై యశ్ దయాల్ బహిరంగంగా ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ, దయాల్ తండ్రి మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పారేశారు. కాగా యశ్ దయాల్ IPL 2025లో RCB తరఫున ఆడాడు. RCB తొలిసారి ఐపీఎల్ టైటిల్(IPL Title) గెలవడంలో యశ్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో అతను 15 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. కాగా యువతి ఆరోపణలు నిజమని రుజువైతే, యశ్ దయాల్ జైలు పాలయ్యే అవకాశం ఉంది, ఇది అతని క్రికెట్ కెరీర్‌కు ముగింపు పడే అవకాశం ఉంది.
🚨 #BreakingNews 🚨 RCB pacer Yash Dayal in trouble, FIR registered for alleged sexual exploitation https://t.co/SWdCY6YGI3
Cricketer Yash Dayal faces legal trouble as an FIR has been filed against him based on a complaint alleging sexual exploitation and false promises of mar…
— Instant News ™ (@InstaBharat) July 8, 2025






