
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ(Telangana)లో రేవంత్ రెడ్డి(Ravanth Reddy) సీఎం కావడం వల్లే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసిందని ఆమె అన్నారు. గురువారం రాత్రి ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఆమె శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడారు. ఒకవేళ గత ఎన్నికల్లో KCR తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే, ఈ విషయం బయటకు వచ్చేది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్(Congress) ఒక జాతీయ పార్టీ అని, అది ఎన్నడూ ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడలేదని షర్మిల స్పష్టం చేశారు.
కేసీఆర్, జగన్ నీచ రాజకీయాలు చేశారు..
‘‘కేసీఆర్, జగన్(Jagan) ఆనాడు నీచ రాజకీయాలు చేశారు. అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారు. నేను ఆర్థికంగా, రాజకీయంగా ఎదగకూడదని నాపై నిఘా పెట్టారు. నేను ఎవరిని కలుస్తున్నానో గ్రహించి నాకు మద్దతు ఇవ్వకుండా పెద్ద పెద్ద నాయకులను ఆపేశారు. ఇదంతా ఫోన్ ట్యాపింగ్ చేసి జరిపిన కుట్రనే. YV సుబ్బారెడ్డి చేతిలో నా ఆడియో ఉంది. స్వయంగా నేనే విన్నా. ఆస్తుల విషయంలో కుట్రలు పన్ని సుబ్బారెడ్డితో జగన్ అబద్ధాలు చెప్పించారు. రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ విషయం వెలుగులోకి వచ్చింది’’ అని అన్నారు.
ఫోన్ల ట్యాపింగ్‌లో నిజాలు నిగ్గు తేల్చాలి
వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) వద్ద ట్యాప్ అయిన తన ఆడియో ఉందని, ఇది నిజమో కాదో.. అతని కుటుంబసభ్యుల మీద ప్రమాణం చేసి నిజం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. YV చేతికి ఆ ఆడియో ఎలా వచ్చిందో విచారణకు పిలిచి ప్రశ్నించాలని, ట్యాపింగ్‌లో నిజాలు నిగ్గు తేల్చాలన్నారు. జగన్ తీరు అలీబాబా 40 దొంగల మాదిరిగా ఉంది. ఇంత చేసిన జగన్‌కు ఫోన్ ట్యాపింగ్‌తో సంబంధం లేదు అంటే ఎలా? దొంగలు ఎక్కడైనా దొంగతనం చేశామని ఒప్పుకొంటారా? నా ఫోన్ మాత్రమే అని భావించాను.. వందల మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఇప్పుడే తెలుస్తుంది. అందరికీ న్యాయం జరగాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు.
#indtoday | YS Sharmila said “The #phonetappingissue came to light only after Revanth Reddy became the #ChiefMinister.”#Truth #RevanthReddy #CM #YSSharmila #PhoneTapping #telangana #telangananews pic.twitter.com/aYleQZ1Zp7
— indtoday (@ind2day) June 19, 2025