మంచు విష్ణు తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన చిత్రం భక్త కన్నప్ప (Kannappa). ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 27న విడుదలకు రెడీగా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో భక్త కన్నప్పలోని కీలక సన్నివేశాలు కలిగిన గంటన్నర నిడివి ఉన్న హర్డ్ డ్రైవ్ ను ఇద్దరు ఎత్తుకెళ్లారు. దీన్ని తీసుకెళ్లిన ఇద్దరు ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. దీంతో మంచు విష్ణు (Manchu Vishnu) సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టు చేశారు.
‘ఎక్స్’ లో మంచు విష్ణు ఎమోషనల్ పోస్టు
ఓ జటాజుటదారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామి హరహర మహ దేవ్ అంటూ ఎక్స్ లో ఆవేదనతో పోస్టు చేశారు. దీంతో మంచు ఫ్యాన్స్ తో పాటు సినీ అభిమానులు కూడా ఆయనకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. మంచు విష్ణు ఇప్పటికే కన్నప్ప ( Kannappa ) మూవీ ప్రమోషన్స్ లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. సినిమాకు సంబంధించిన హార్డ్ డిస్క్ ( hard disk) మాయం కావడంపై ఫిల్మ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ కు రెడ్డి విజయ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. కన్నప్ప చిత్ర కంటెంట్ ఉన్న హార్డ్‌డ్రైవ్‌ను డీటీడీసీ కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్ (film nagar) లోని విజయ్ కుమార్ ఆఫీసుకు ముంబయి లోని హెచ్ఐవీఈ స్టూడియోస్ వారు పంపారు. ఇక్కడకు వచ్చిన పార్సిల్ ను ఆఫీసు బాయ్ రఘు ఈనెల 25న తీసుకున్నారు. ఈ హర్డ్ డ్రైవ్ ను చరిత అనే మహిళకు ఎవరికీ చెప్పకుండా అప్పగించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ కనిపించకుండా పోయారు. దీంతో వీరిద్దరూ కావాలనే కన్నప్ప చిత్రానికి నష్టం కలిగించేందుకు ఇలా చేస్తున్నారని విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మిస్ అయిన హర్డ్ డిస్క్ లో కీలక యాక్షన్ సీన్స్, ప్రభాస్ (prabhas) కు సంబంధించిన సీన్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మంచు విష్ణు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల టాక్ నడుస్తోంది.






