పాకిస్థాన్ పై ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) మరోసారి నిప్పులు చెరిగాడు. పాక్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించి భారత్ పై యుద్ధం చేస్తోందని విమర్శించారు. గుజరాత్ (Gujarat) లోని గాంధీనగర్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పాక్ కు తీవ్ర హెచ్చరికలు పంపారు. 75 సంవత్సరాలుగా పర్యాటకులు, యాత్రికులు, సాధారణ పౌరులు ఎందరిపైనో దాడులు చేశారు. అయినా తట్టుకున్నాం. ఇక నుంచి ఉపేక్షించేది లేదు. ఇక మాట మాటకు మాట.. తూటాకు తూటా అని అన్నారు.పాక్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తుందన్నారు. అయినా ఎప్పటికప్పుడు ఉగ్రవాదులను మట్టుబెడుతున్నామన్నారు.
దాడికి ప్రతి దాడి చేస్తాం..
75 ఏళ్ల భారత స్వాతంత్య్రంలో ఎన్నో సార్లు మాపై దాడులు చేసినా మేం తట్టుకున్నాం. ఇక నుంచి దాడికి ప్రతి దాడి కచ్చితంగా ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి ఉగ్రదాడులు చేస్తుంటే ఇంకా తట్టుకోవాలా అని ప్రజలను ప్రశ్నించారు. ఇండియా శాంతిని కోరుకుంటుందని కానీ పదే పదే రెచ్చగొడితే మాత్రం ప్రతీకారం తప్పదన్నారు. భారతదేశం శాంతిని కోరుకుంటుందని ఒక వేళ మా సహనాన్ని పరీక్షిస్తే దేశం యోధుల భూమి అని ప్రపంచానికి మళ్లీ గుర్తుచేయాల్సిన అవసరం వస్తుందన్నారు.
పాక్ రాడార్లు, ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం..
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లో (jammu and Kashmir) ని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు చనిపోవడంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి మే 7న చేసిన దాడుల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశారు. భారత దాడులకు ప్రతిగా పాక్ డ్రోన్‌లు, క్షిపణులతో భారత సైన్యం పౌర ప్రాంతాలపై దాడి చేసింది. వైమానిక దాడులతో పాక్ విమాన స్థావరాలను, ఎయిర్ డిఫెన్స్ రాడార్లను లక్ష్యంగా చేసుకుంది. తర్వాత పాక్ శాంతికి మొగ్గుచూపింది. మే 12న కాల్పుల విరమణను ప్రకటించారు.ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, విపక్ష నాయకులు భారత సైనిక దళాలను అభినందించారు. పహల్గామ్ ఉగ్రదాడికి సమర్థవంతంగా ప్రతీకారం తీర్చుకున్నారని పాక్ క్షిపణి దాడులను విజయవంతంగా తిప్పికొట్టారని ప్రశంసించారు. ఆపరేషన్ సిందూర్ (Operation sindoor)తో ప్రజల్లో దేశ భక్తి కనిపించిందన్నారు.






