Cricket News: టార్గెట్ 427.. రెండు పరుగులకే ఆలౌట్

అనిశ్చతికి మరో పేరు క్రికెట్‌. భారీ చేయగలిగే సత్తా ఉన్న జట్టు ఉన్నట్టుండి ఢీలాపడుతుంది. ఒక్కోసారి అనామక జట్టు చెలరేగిపోతుంది. కొన్ని మ్యాచ్లలో ఎలాంటి ఫలితం వస్తుందో ఎవరూ ఊహించలేరు. అనూహ్యంగా రాణించి రికార్డులు బద్ధలు చేస్తే.. మరోసారి పేలవంగా ఆడి చెత్త రికార్డులను నమోదు చేస్తుంటారు. తాజాగా ఓ కౌంటీ క్రికెట్‌లో ఎవరూ ఊహించని రికార్డే నమోదైంది.

 

45 ఓవర్లలో 426 పరుగులు

 

ఇంగ్లాండ్ వేదికగా ప్రస్తుతం మిడిలెక్స్ కౌంటీ క్రికెట్ లీగ్ (Middlesex County Cricket League) జరుగుతోంది. ఇందులో భాగంగా సోమవారం నార్త్ లండన్ సీసీ, రిచ్‌మండ్ ఫోర్త్ ఎలెవన్ (Richmonds Fourth XI) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన రిచ్‌మండ్ ఫోర్త్ ఎలెవన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే బౌలర్లు ధారాళంగా రన్స్ ఇవ్వడంతో ప్రత్యర్థి జట్టు 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 426 పరుగులు చేసింది.

 

9 మంది బ్యాటర్లు డకౌట్

 

అనంతరం బ్యాటింగ్కు దిగిన రిచ్‌మండ్ సీసీ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా క్రీజులో నిలవలేకపోయారు. వచ్చినవారు వచ్చినట్లే పెవిలియన్ చేరారు. టార్గెట్ భారీగా ఉండడంతో బ్యాటర్లు చెలరేగి ఆడుతారని భావించిన ప్రేక్షకులకు గ్రౌండ్లో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. రిచ్‌మండ్ ఫోర్త్ ఎలెవన్ జట్టు మొత్తం 5.2 ఓవర్లు ఎదుర్కొని కేవలం 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. 424 రన్స్ తేడాతో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఒకే ఒక్క బ్యాటర్ ఖాతా తెరవగా.. మిగతా 9 మంది ప్లేయర్లు డకౌట్ అయ్యారు. రిచ్‌మండ్ చేసిన 2 రన్స్‌లో ఒకటి వైడ్ ద్వారా వచ్చిందే. ఈ మ్యాచ్కు సంబంధించిన స్కోరు కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు 6 పరుగులు. ఇది 1810లో నమోదైంది. తాజాగా ఆ రికార్డు బద్దలైంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *