హరియాణాలోని (Haryana) పంచుకులలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు కారులో సూసైడ్ చేసుకున్నారు. బాగేశ్వర్ బాబా గా పేరొందిన దీరేంద్ర కృష్ణ శాస్త్రి నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైన ఒక కుటుంబం వెళ్లిపోయే సమయంలో సూసైడ్ చేసుకుంది. దీంతో పంచకులలో కలకలం రేగింది.
ఒకే కారులో ఏడుగురు డెడ్ బాడీలు
సోమవారం పంచకులలో కారు నడిపే యజమాని కాలిబాటపై కూర్చున్నాడు. కారును రోడ్డు పక్కన పార్క్ చేశాడు. ఈ సమయంలో స్థానికుడు ఒకరు ఇక్కడి నుంచి కారును తీసేయాలని కోరగా.. తాను ప్రవీణ్ మిట్టల్ అని ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చామని చెప్పాడు. భాగేశ్వర్ ధామ్ (Bhageshwar Dam)నుంచి తిరిగి వెళుతున్నామని హోటల్ దొరక్కపోవడంతో ఇక్కడ రోడ్ పైనే ఆగినట్లు చెప్పాడు. కారును అక్కడి నుంచి తీసేయాలని చెప్పగా.. కారులో వెళుతుంటే అందులో ఉన్న వారు స్పృహ తప్పి ఉండటాన్ని స్థానికులు గమనించారు. దీంతో కారును ఆపి నిలదీయగా వారంతా తన కుటుంబ సభ్యులని అందరూ సూసైడ్ చేసుకున్నారని ప్రవీణ్ మిట్టల్ వివరించాడు. తాను కూడా ఐదు నిమిషాల్లో చనిపోతానని చెప్పాడు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరుగురు మృతి చెందగా..చికిత్స పొందుతూ ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయాడు.
పంచుకుల డీసీపీ హిమాద్రి కౌశిక్ మాట్లాడుతూ.. ప్రవీణ్ మిట్టల్ కుటుంబం డెహ్రడూన్ కు చెందిన వారని తెలిపాడు. ప్రవీణ్ మిట్టల్ (Praveen Mittal) తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు చనిపోయినట్లు గుర్తించారు. డెడ్ బాడీలకు పోస్టుమార్టంకు పంపించారు. కాగా కారులో సూసైడ్ నోట్ లభించింది. కుటుంబానికి పెద్ద మొత్తం లో అప్పులు, తీవ్రంగా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండటంలోనే ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నామని సూసైడ్ నోట్ లో రాసి ఉంది.






