Unni Mukundan: మేనేజర్‌ను చితకబాదిన హీరో ఉన్ని ముకుందన్

మార్కో మూవీతో పేరుతెచ్చుకున్న ఉన్ని ముకుందన్ (Unni Mukundan) ఓ కేసులో చిక్కుకున్నాడు. తన మేనేజర్ను తీవ్ర పదజాలంతో దూషిస్తూ చితకబాదాడు. దీంతో అతడు గాయాలతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. హీరో టొవినో థామస్ ‘నరివేట్టా’ (Narivetta) మూవీని ప్రశంసిస్తూ మేనేజర్ విపిన్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది నచ్చని ఉన్ని ముకుందన్ అతడిపై దాడి చేసినట్లు సమాచారం.

 

పాజిటివ్ పోస్టులు పెట్టడంతో..

 

విపిన్ కుమార్ ఉన్ని ముకుందన్ వద్ద మేనేజర్‌గా పనిచేస్తూనే ఇతర చిత్రాలకు పీఆర్వోగా కూడా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో నరివేట్టా గురించి పాజిటివ్ పోస్టులు పెట్టడంతో అవి నచ్చని ముకుందన్‌ సోమవారం ఉదయం 11.30 గంటలకు దాడికి పాల్పడినట్లు విపిన్ ఆరోపించాడు. దాడిలో గాయపడ్డ విపిన్.. మొదట ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకొని ఆ తర్వాత నేరుగా కేరళ కొచ్చిలోని ఇన్ఫోపార్క్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఉన్ని ముకుంద్పై ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఉన్నిపై కేసు నమోదు చేశారు.

 

మానసిక సమస్యలతో బాధపడుతున్న ఉన్ని ముకుందన్!

 

ఉన్ని ముకుందన్ మీద ఇలాంటి ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. ఓ అమ్మాయిని వేధించిన కేసులో అతడి మీద విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఉన్ని ముకుందన్ కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయట. మార్కో లాంటి పెద్ద హిట్ తర్వాత ఆయన చేసిన ఓ మూవీ అంతగా ఆడకపోవడంతో మరింత ఫ్రస్టేట్ అయ్యేవాడని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *