Dr Namratha: ‘సృష్టి ఫర్టిలిటీ సెంటర్’ కేసులో విస్తుబోయే విషయాలు

సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సరోగసీ కేసు(Srushti Case)లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో చైల్డ్ ట్రాఫికింగ్(Child trafficking), సరోగసీ మోసాల(Surrogacy scams)పై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా డా. నమ్రత(Dr Namratha)కు చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఏజెంట్ల(Agents) సహాయంతో ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడతాయని భావిస్తున్నారు. డా. నమ్రత ముఠా చైల్డ్ ట్రాఫికింగ్ కార్యకలాపాలు దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించినట్లు తెలుస్తోంది.

సృష్టి' కేసు.. వెలుగులోకి సంచలన నిజాలు | Sensational Facts In Srushti Test  Tube Baby Center Case | Sakshi

ముఖ్యంగా అస్సాం, బిహార్, ముంబై, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి అక్రమంగా పిల్లలను తీసుకొచ్చినట్లు తేల్చారు. ఈ ట్రాఫికింగ్‌లో ఎంతమంది ఏజెంట్లు, డాక్టర్లు, ఇతర వ్యక్తులు ఉన్నారనే దానిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇంకా ఈ కేసులో మరింత లోతుగా వెళ్తే దేశవ్యాప్తంగా ఉన్న అక్రమ ముఠాల గురించి బయటపడే అవకాశం ఉంది.

ఇక పోలీసుల విచారణలో డాక్టర్ నమ్రత దాదాపు 80 ఫేక్ సరోగసీ కేసుల(Fake surrogacy cases)ను నిర్వహించినట్లు అంగీకరించారని సమాచారం. ఈ కేసులు కేవలం చైల్డ్ ట్రాఫికింగ్‌కు మాటుగా ఉపయోగపడ్డాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఎంతకాలం నుంచి నడుస్తోంది, ఎంతమంది ఇందులో బాధితులుగా ఉన్నారనే వివరాలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ కేసు విచారణ(investigation) పూర్తయితే ఈ మోసాల వెనుక ఉన్న పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *