సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి హాసన్(Shruti Haasan’), సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలలో ఒకరు. తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు, లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ ఉంటుంది.
అయితే ఇటీవల ఆమె ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. శ్రుతి అకౌంట్ నుంచి బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీకి సంబంధించిన సందేశాలు వరుసగా షేర్ అవ్వడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. మావెరిక్స్ యజమాని మార్క్ క్యూబన్ పేరుతో కూడిన ట్వీట్లు అకస్మాత్తుగా పోస్ట్ కావడం అనుమానాలకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో శ్రుతి హాసన్ స్పందిస్తూ.. తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. ‘‘హాయ్ లవ్లీస్… నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అవి నేను పోస్ట్ చేయడం లేదు. దయచేసి ఆ పేజీలో చాట్ చేయవద్దు. నేను తిరిగి రికవర్ చేసుకునే వరకు దయచేసి జాగ్రత్తగా ఉండండి” అంటూ శ్రుతి పేర్కొంది. దీనితో పాటు హార్ట్ ఎమోజీ షేర్ చేస్తూ అభిమానులకు తన ప్రేమను తెలియజేశారు. 2017 లోను శ్రుతి హాసన్ సోషల్ మీడియా అకౌంట్ హ్యాకింగ్‌కు గురైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అకౌంట్ హ్యాక్ జరగడంతో అభిమానులు ‘‘తరచూ శృతి ఖాతానే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..” అంటూ నెటిజన్లు ఆలోచనలో పడ్డరు.
ఇక తన రీ ఎంట్రీ తర్వాత శ్రుతి హాసన్ కెరీర్‌లో మంచి జోష్‌లో ఉంది. వకీల్ సాబ్, క్రాక్, వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ పార్ట్ 1 వంటి వరుస హిట్స్‌తో మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. రజనీకాంత్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కూలీ సినిమాలో శ్రుతి నటిస్తోంది. అలాగే విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న ట్రైన్ మూవీలోనూ హీరోయిన్‌గా కనిపించనుంది.






