Border-Gavaskar Trophy 2024-25: రెండో టెస్టుకూ గిల్​ దూరమేనా?

ఎడమ చేతి బొటన వలికి ఫ్రాక్చర్​ కారణంగా మొదటి టెస్టుకు దూరమై యువ ఓపెనర్​ శుభ్​మన్​ గిల్ (Shubman Gill)​ అడిలైడ్​లో జరిగే రెండో టెస్టుకు (Adelaide Test) కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్​ గవాస్కర్​ ట్రోపీ మొదటి టెస్టుకు దూరమైన గిల్​.. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నప్పటికీ రెండో టెస్టుకు తగినంత ప్రాక్టీస్​ అవసరమని టీమిండియా మేనేజ్​మెంట్​ భావిస్తోందట. అందుకే అతడిని రెండో టెస్టుకు తీసుకోవడం లేదని సమాచారం.

ఒకవేళ రెండో టెస్టుకు శుభ్​మన్​ దూరమైతే జైస్వాల్​తో కలిసి రెండో టెస్టులోనూ కేఎల్​ రాహుల్​ ఓపెనింగ్​ చేసే అవకాశం ఉంది. అయితే పెర్త్​ టెస్టులో దారుణంగా విఫలమైన దేవ్​దత్​ పడిక్కల్​ను పక్కనపెట్టాలని మేనేజ్​మెంట్​ భావిస్తే.. రోహిత్​ శర్మ ప్లేయింగ్​ 11లోకి వస్తాడు. జైస్వాల్​తో కలిసి ఓపెనింగ్​కు దిగితే కేఎల్​ రాహుల్​ వన్​ డౌన్​లో వస్తాడు.

భారత్​, ఆస్ట్రేలియా ప్రతిష్ఠాత్మకంగా భావించే బోర్డర్​ గవాస్కర్​ ట్రోపీ (Border Gavaskar Trophy) మొదటి టెస్టులో భారత్​ దుమ్ముదులిపింది. ఆతిథ్య జట్టును 295 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసింది. తొలి ఇన్నింగ్స్​లో కేవలం 150 పరుగులే చేసిన టీమిండియా.. ఈ తర్వాత 104 రన్స్​కే కంగారూ జట్టును కట్టడి చేసింది. కెప్టెన్​ బుమ్రా తన పేస్​ బౌలింగ్​తో ఆస్ట్రేలియా బ్యాటర్లను బెంబేలెత్తించి 5 వికెట్లు తీశాడు. సెకండ్​ ఇన్నింగ్స్​లో జైశ్వాల్​, విరాట్​ కోహ్లీ సెంచరీలకు తోడు కేఎల్​ రాహుల్​ రాణించడంతో భారత్​ 487 రన్స్​ చేసి డిక్లేర్​ చేసింది. ఆ తర్వాత బుమ్రా, సిరాజ్​,హర్షిత్​ రాణా చెలరేగడంతో కంగారూ జట్టు 238 రన్స్​ చేసి ఆలౌట్​ అవడంతో భారత్​ 295 రన్స్​ తేడాతో విజయం సాధించింది.

 

Related Posts

BWF World Championships: సెమీస్‌లో చిరాగ్-సాత్విక్ జోడీ.. సింధుకు తప్పని ఓటమి

పారిస్‌లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ (BWF World Championships-2025)లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్ రంకిరెడ్డి(Satwiksairaj Rankireddy), చిరాగ్ శెట్టి(Chirag Shetty) జోడీ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్‌(Semifinals)కు చేరి పతకాన్ని ఖాయం చేసుకుంది.…

PKL- 2025: సాగర తీరంలో కబడ్డీ కూత.. నేటి నుంచి పీకేఎల్ సీజన్ 12 షురూ

క‌బ‌డ్డీ అభిమానులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న Pro Kabaddi League-2025 వ‌చ్చేసింది. ఇప్ప‌టికే విజ‌యవంతంగా 11 సీజ‌న్లు పూర్తి చేసుకుంది. నేటి (ఆగ‌స్టు 29) నుంచి 12వ సీజ‌న్ (PKL 12) ప్రారంభం కానుంది. ఈ సారి మొత్తం 12 జ‌ట్లు టైటిల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *