‘3BHK’ OTT: సిద్ధార్థ్ 3BHK ఓటీటీకి వచ్చేస్తోంది.. ఎందులో ఎప్పుడంటే?

తమిళం, తెలుగు సినిమాల్లో తనదైన శైలిలో పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న హీరో సిద్ధార్థ్(Siddharth), గతంలో ఎన్నో హిట్ ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలతో బాక్సాఫీస్‌ వద్ద మంచి మార్కులు కొట్టారు. అయితే గత కొన్నేళ్లుగా ఆయన కెరీర్ స్థిరంగా సాగలేదు. వరుసగా ఫ్లాపులు ఎదురయ్యాయి. ఎంతో ఆశతో విడుదలైన భారతీయుడు 2 సైతం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సమయంలో రేసులో నిలవాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిందే. ఈ దశలో సిద్ధార్థ్ ‘3BHK’ అనే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను నమ్ముకున్నారు.

ఈ మూవీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ భావోద్వేగాలు, సొంతింటి కల చుట్టూ తిరుగుతుంది. జూలై 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టకపోయినా, మంచి రివ్యూలు మాత్రం అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ(OTT Release)లోకి రావడానికి సిద్ధమైంది. ఆగస్ట్(August) 1 నుంచి ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో “Simply South” ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ ఇటీవల స్పష్టత ఇచ్చారు.

ఈ సినిమాలో సిద్ధార్థ్ సరసన చైత్ర జే ఆచార్ నటించగా,  శ్రీ గణేష్ దర్శకత్వం వహించారు. చిత్రంలో ఆర్. శరత్ కుమార్, దేవయాని, యోగిబాబు, వివేక్ ప్రసన్న, సుబ్బు పంచులు కీలక పాత్రలు పోషించారు. శాంతి టాకీస్ బ్యానర్‌పై అరుణ్ విశ్వ ఈ సినిమాను నిర్మించగా, దినేష్ బీ కృష్ణన్ మరియు జితిన్‌లు సినిమాటోగ్రఫీ అందించారు. సంగీతాన్ని అమృత్ రామ్‌నాథ్ అందించారు.

అయితే ఈ మూవీ ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. భారత్‌కు వెలుపల ఉన్న ప్రేక్షకులు మాత్రమే 3BHK సినిమాను వీక్షించగలుగుతారు. భారతదేశంలో స్ట్రీమింగ్‌కి సంబంధించి త్వరలోనే మరింత సమాచారం వెల్లడించనున్నట్లు ప్రకటించారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *