టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), బేబీ ఫేం వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న చిత్రం ‘జాక్’ (Jack : Konchem Crack). కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఇందులో భాగంగానే తాజాగా మేకర్స్ జాక్ ట్రైలర్ను విడుదల చేశారు.
నవ్వులు పూయించిన సిద్ధు
ఈ ట్రైలర్ (Jack Trailer) ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. సిద్ధూ మరోసారి తనదైన శైలిలో నవ్వులు పూయించాడు. తన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగుతో అదరగొట్టాడు. ముఖ్యంగా ట్రైలర్ వీడియోలో సిద్ధూతో నటుడు ప్రకాశ్ రాజ్ సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. తన మిషన్ పేరు బటర్ఫ్లై అంటూ సిద్ధూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఇక వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) కూడా చాలా అందంగా కనిపించింది. ఈ మూవీలో ఆమెది బలమైన పాత్రేనని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మీరు కూడా ఓసారి ట్రైలర్ చూసేయండి.






