మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్(Gold)కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు(Gold Rates) భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం (మే 20)న స్వల్పంగా రూ.450 మేర తగ్గిన పుత్తడి ధర ఇవాళ భారీగా పెరిగింది. దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు.
ఈరోజు ఎంతంటే..
ఇక బుధవారం (మే 21) హైదరాబాద్(Hyderabad)లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.2,400 పెరిగి రూ.97,420కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10గ్రాములకు రూ.2,200 పెరిగి రూ.89,300 వద్ద కొనసాగుతోంది. అటు కేజీ వెండి(Silver)పై ఏకంగా రూ.3000 పెరిగి రూ.1,11,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అమలవుతున్నాయి.






