లండన్‌లోని ది ఓవల్(The Oval)లో జరుగుతున్న ఇండియా-ఇంగ్లండ్(India vs England) ఐదో టెస్ట్ మ్యాచ్‌లో రెండో రోజు ఉత్కంఠభరితంగా ముగిసింది. ఒకేరోజులో మొత్తం 15 వికెట్లు పడటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం భారత జట్టు 52 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌లో 75/2 స్కోరుతో రెండో రోజును ముగించింది. యశస్వీ జైస్వాల్ (51 నాటౌట్) అర్ధసెంచరీతో చెలరేగగా, ఇంగ్లండ్ ఫీల్డర్లు అతడిని రెండుసార్లు డ్రాప్ చేశారు. కేఎల్ రాహుల్ (1), సాయి సుదర్శన్ (11) వికెట్లు కోల్పోయినా, జైస్వాల్(Jaiswal) దూకుడుగా ఆడి భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు.

చెలరేగిన సిరాజ్, ప్రసిద్ధ్
అంతకుముందు రెండో రోజు ఆటలో భారత్(Team India) తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ పేసర్ గస్ అట్కిన్సన్ (5/33) అయిదు వికెట్లతో ఇంగ్లండ్ బౌలింగ్‌ను ముందుండి నడిపాడు. అనంతరం ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ (52 నాటౌట్), బెన్ డకెట్ (43) 92 పరుగుల వేగవంతమైన ఓపెనింగ్ భాగస్వామ్యంతో దూసుకెళ్లారు. అయితే, మహమ్మద్ సిరాజ్ (4 వికెట్లు), ప్రసిద్ధ్ కృష్ణ (4 వికెట్లు) అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను 247 పరుగులకు కట్టడి చేశారు. దీంతో ఆతిథ్య జట్టుకు కేవలం 23 పరుగుల ఆధిక్యం మాత్రమే ఇచ్చారు. హ్యారీ బ్రూక్ (53) అర్ధసెంచరీ సాధించినప్పటికీ, భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు.

సమం చేయాలంటే గెలవాల్సిందే..
కాగా ఉత్కంఠ సాగుతున్న ఈ మ్యాచులో ఇంగ్లండ్‌కు కీలక బౌలర్ క్రిస్ వోక్స్(Chris Woaks) భుజం గాయం కారణంగా దూరమవ్వడం ఆ జట్టుకు ఎదురుదెబ్బగా మారింది. మరోవైపు భారత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubhman Gill) నాయకత్వంలో జట్టు పోరాడుతోంది. మూడో రోజు ఆట ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఉంది. భారత్ ఈరోజు మొత్తం బ్యాటింగ్ చేసి భారీ టార్గెట్(Target)ను ఆతిథ్య జట్టుకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే గెలిచే అవకాశాలు ఉంటాయి. కాగా ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. అటు సిరీస్‌ను సమం చేయాలంటే భారత్ ఈ మ్యాచ్‌ను గెలవాల్సి ఉంది.
ENGLAND VS INDIA : 5th test Day 2 at kia oval 15 wickets fall in a day’s play ,most in this series.
This game has moved at a breakneck pace.
India-72/2 leading by 52 runs at Day 2 stumps. pic.twitter.com/dYUARHSSgx
— IndianMirror (@Infinity01world) August 1, 2025






