ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన స్మృతి ఇరానీ(Smriti Irani) మొదట మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. అందాల పోటీల్లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అక్కడి నుంచి టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి, భారతీయ బుల్లితెర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలను పోషించారు.
2000లో ప్రారంభమైన ‘క్యుంకీ సాస్ బీ కభీ బహు థీ'(“Kyunki Saas Bhi Kabhi Bahu Thi”) సీరియల్ ఆమె కెరీర్‌కు మలుపు తిప్పింది. సుమారు ఎనిమిదేళ్లపాటు ప్రసారమైన ఈ సీరియల్‌లో ఆమె పాత్రలో తులసి విరానీగా దేశంలోని ప్రతి ఇంట్లోని ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. కుటుంబ సంబంధాల విలువలను తెలియజేసే ఈ సీరియల్‌లో ఆమె పాత్ర ఆదర్శ భార్యగా, అమ్మగా నటించిన తీరు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
ఆ తర్వాత రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, భారతీయ జనతా పార్టీకి కీలక నేతగా ఎదిగారు. రెండు పర్యాయాలు కేంద్ర మంత్రిగా పనిచేశారు. మహిళా శిశు అభ్యుదయం, మానవ వనరుల అభివృద్ధి వంటి శాఖల్లో ఆమె నిర్వహించిన విధానం ప్రశంసలు అందుకుంది. అయితే 2019లో అమేథి నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు.
తాజాగా మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన స్మృతి ఇరాని, తనను స్టార్ చేసిన అదే సీరియల్ క్యుంకీ సాస్ బీ కభీ బహు థీ(“Kyunki Saas Bhi Kabhi Bahu Thi2”) సీక్వెల్‌తో బుల్లితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సీరియల్ సీజన్ 2 ఈ నెల జూలై(July) 29 నుంచి ప్రసారం కానున్న ఈ సీరియల్(Serial) ప్రమోషన్‌లో భాగంగా విడుదలైన ఆమె ఫస్ట్ లుక్(Fist look)కి మంచి స్పందన లభిస్తోంది. పదేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్‌పై కనిపించబోతున్న ఆమెను చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
ఇక స్మృతి ఇరానీ ‘జై బోలో తెలంగాణ'(Jai Bolo Telangana Movie) తెలుగు సినిమాలోనూ నటించారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రాన్ని ఎన్. శంకర్(M. Shankar) తెరకెక్కించారు. ఇందులో జగపతిబాబు(Jagapathi Babu) హీరోగా నటించగా, అతని భార్య జయమ్మ పాత్రలో స్మృతి కనిపించారు. సామాజిక అంశాలపై ఓ మదర్‌గా ఆమె భావోద్వేగాలను అద్భుతంగా ప్రదర్శించారు. వృద్ధురాలిగా కనిపించేందుకు జుట్టుకు తెల్లటి రంగు చేసుకొని పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి.







