ఇంగ్లండ్ ఉమెన్స్(England Womens)తో జరిగిన మ్యాచులో భారత మహిళల(India Womens) జట్టు అదరగొట్టింది. వారి సొంతగడ్డపై ఇంగ్లిష్ జట్టును 97 పరుగుల తేడాతో చిత్తు చేసింది. 211 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 14.5 ఓవర్లలో కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో కెప్టెన్ సీవర్ (42 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 66 రన్స్) హాఫ్ సెంచరీ చేసింది. బ్రూమౌంట్ 10, అర్లోట్ 12 పరుగులు మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో శ్రీచరణి 4 వికెట్లతో సత్తాచాటింది. దీప్తి శర్మ 2, రాధా యాదవ్ 2 వికెట్లు తీయగా, అమన్‌జోత్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ పడగొట్టారు.
Team India Women start the England series with a bang! 💥🇮🇳
A dominant 97-run victory in the 1st T20I sets the tone! 🔥#INDWvsENGW #TeamIndia #WomenInBlue pic.twitter.com/QSZfbeHxeP
— Cricket Impluse (@cricketimpluse) June 28, 2025
కెరీర్లోనే తొలి టీ20 సెంచరీతో మెరిసిన మంధాన
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 210/5 భారీ స్కోరు చేసింది. టీమిండియా(Team India) కెప్టెన్ స్మృతి మంధాన(Smriti Mandhana) తన కెరీర్‌ల్లోనే తొలి సెంచరీ(Maiden Century)తో మెరిసింది. ఓపెనర్‌గా వచ్చిన మంధాన వచ్చీరావడంతోనే ఇంగ్లిష్ బౌలర్లపై ఎదురు దాడికి దిగింది. ఈ క్రమంలో 51 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. శతకం తర్వాత వేగంగా ఆడే క్రమంలో (112) చేసి ఔటయింది. భారత జట్టులో షెఫాలీ వర్మ 20, హర్లీన్ డియోల్ 43, ఘోష్ 12 రన్స్ చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో బెల్ 3 వికెట్లతో రాణించింది. సెంచరీతో చెలరేగిన స్మృతి మంధానకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. నాటింగ్హమ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. కాగా ఇరుజట్ల మధ్య రెండో టీ20 జులై 1న బ్రిస్టల్(Bristol) వేదికగా జరగనుంది.







