డిజిటల్ యుగంలో సామాజిక మాధ్యమాల(Social Media)ను ఉపయోగించుకుని అన్ని పార్టీలు(Political Parties) తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెలంగాణ(Telangana)లో తర్వలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల(Local body elections) నేపథ్యంలో ఆయా ప్రధాన రాజకీయ పార్టీలు SMను మరో ప్రధానాస్త్రంగా ఎంచుకుంటున్నాయి. ఓ వైపు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా ఫోన్లు కలిగి ఉన్న వ్యక్తుల వద్దకు పరోక్షంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఆయా పార్టీలు వాట్సాప్(WhatsApp)లో విచ్చలవిడిగా గ్రూపులను క్రియేట్ చేస్తున్నాయి. ప్రస్తుతం గ్రామానికి ఒక పార్టీ గ్రూపును, కులానికో గ్రూపును క్రియేట్ చేస్తున్నారు.

ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా..
ప్రస్తుతం సోషల్ మీడియా ఎఫెక్ట్ జనాల్లో బాగానే ఉంది. అందులో వచ్చే వార్తల(news)ను, పోస్టింగు(Poste)లను ప్రజలు సులభంగా నమ్ముతుంటారు. దీన్నే రాజకీయ పార్టీలు అస్త్రంగా మలుచుకుంటున్నాయి. తప్పిదాలను, ప్రతికూలతలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లడం పైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. ఆధునిక రాజకీయాల్లో సోషల్ మీడియా ఒక శక్తిమంతమైన(powerful) ప్రచార సాధనంగా నాయకులు ఉపయోగించుకుంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా తమ కార్యక్రమాలను, హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఫేస్‌బుక్(Facebook), ట్విటర్ (X), ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్(Youtube) వంటి వేదికలను విరివిగా ఉపయోగిస్తున్నాయి.

అయితే, తర్వలో తెలంగాణలో జరగనున్న పంచాయతీ(Panchayath Elections), ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపొచ్చని రాజకీయ విశ్లేషకులు(Political analysts) అభిప్రాయపడుతున్నారు. మరి ప్రజలు, ముఖ్యంగా ఓటర్లు(Voters) ఈ టెక్ ప్రచారాన్ని ఎంత వరకు స్వీకరిస్తారనే దానిపైనే అభ్యర్థుల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.






