సౌత్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మనీ ఇచ్చి మరీ తనపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ బాంబ్ పేల్చింది. తాజాగా ఈ అమ్మడు కావాలనే కొంతమంది తనపై నెగిటివ్ ప్రచారం చేయడానికి చాలా డబ్బు తగలేస్తున్నారు అంటూ షాకింగ్ కామెంట్స్(Shocking Comments) చేసింది. పూజా ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ తనకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది. సోషల్ మీడియాలో తన గురించి ఎన్నో రకాలుగా వచ్చిన ట్రోలింగ్స్(Trolling) తనను, తన కుటుంబాన్ని బాధ పెట్టాయని ఆవేదనను వ్యక్తం చేసింది.

తర్వాత దానిని పట్టించుకోవడం మానేశా
అంతేకాకుండా నటిగా తన ఎదుగుదలను దెబ్బ కొట్టడానికి కొంతమంది కోట్ల రూపాయలు ఇచ్చి ట్రోలింగ్ చేయించారని ఈ సందర్భంగా పూజ హెగ్డే సంచలన విషయాన్ని బయట పెట్టింది. వాళ్లు కొన్ని మీమ్ పేజెస్‌ను సంప్రదించగా “మిమ్మల్ని ట్రోల్ చేయడానికి ఇంత పే చేస్తున్నారు. మీరు గనక ఈ ట్రోలింగ్‌ని ఆపాలన్నా, లేదంటే తిరిగి ఫైట్(Fight) చేయాలన్నా ఇంత ఖర్చవుతుంది” అని ముఖం మీద చెప్పేశారట. ఇదంతా తెలుసుకున్న తర్వాత ట్రోలింగ్‌ను పట్టించుకోవడం మానేశానని, ఇప్పుడు తన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని వెల్లడించింది.

ఆమెను టార్గెట్ చేసింది ఎవరు?
అయితే తాను ఎవ్వరికీ ఎలాంటి చెడు చేయలేదని, అయినప్పటికీ ఎందుకు తనపై ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారో తెలియట్లేదని ఆవేదనను వ్యక్తం చేసింది. కానీ తనను టార్గెట్ చేయడానికి ట్రోలర్స్‌కి భారీగా డబ్బును ఖర్చుపెట్టిన వ్యక్తి ఎవరు? అన్న విషయాన్ని మాత్రం పూజా బయట పెట్టలేదు. దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో పూజా హెగ్డే ఎవరిని బ్లేమ్ చేస్తోంది? ఆమెను టార్గెట్ చేసింది ఎవరు? అన్నది చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగు(Telugu), తమిళ(Tamil) భాషల్లో స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తోంది.






