‘మజాకా’ నుంచి ‘సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ’ సాంగ్ ఔట్

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ (Sandeep Kishan), రీతూ వర్మ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మజాకా (Mazaka)’. ఈ సినిమా అనౌన్స్ మెంట్ నుంచి చిత్రబృందం నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇక సినిమా ప్రమోషన్స్ ను నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనే విధంగా వినూత్న రీతిలో చేస్తోంది. ఇటీవలే ఈ సినిమాలో ఓ పాట షూటింగును లైవ్ రికార్డు చేసి ప్రేక్షకుల కోసం రిలీజ్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ’ను విడుదల చేసింది.

సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ

‘సొమ్మసిల్లి పోతున్నవే ఓచిన్న రాములమ్మ’ (Sommasilli Pothunnave O Chinni Ramulamma).. పాట యూట్యూబ్‌లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. 2022లో రిలీజైన ఈ పాట 280+ మిలియన్‌ (28 కోట్లకుపైగా) వ్యూస్‌ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు ఇదే పాటను రీ క్రియేట్ చేసింది మజాకా టీమ్. ఈ నెల 26వ తేదీన ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా తాజాగా మేకర్స్ ఈ పాటను రిలీజ్‌ చేశారు.

అన్షు రీ ఎంట్రీ

ఈ పాటకు లియోన్‌ జేమ్స్‌ మ్యూజిక్ కంపోజ్ చేయగా యంగ్ టాలెంట్ రేవంత్ (Singer Revanth) ఈ పాటను పాడారు. రాము రాథోడ్‌, ప్రసన్నకుమార్‌ బెజవాడ ఈ పాటకు లిరిక్స్ అందించారు. సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan), రీతూ వర్మ (Ritu Varma) జంటగా దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాతో మన్మథుడు ఫేం అన్షు తెలుగు తెరపైకి రీ ఎంట్రీ ఇస్తోంది. రావు రమేశ్, మురళీ శర్మ ఈ చిత్రంలో కీలక పాత్రలు నటిస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *